ఒత్తిడి --లఘు కవిత్వం --- యం. వి. ఉమాదేవి. నెల్లూరు.

 మంచి అనుభూతితో సంతోషం  పండాల్సిన బ్రతుకు 
భరించలేని అనుభవంతో 
తట్టుకోలేక పోతే... 
ఒత్తిడి కొండచిలువలా చుట్టేసి 
ఓర్పనే శల్యాలన్నీ.. పటపట విరిచి, 
ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్ధితిలో 
మెల్లమెల్లగా మనిషిని కబళిస్తుంది... 
ఇది లోకం! స్వార్థం,దురాశతో 
విస్మయం కలిగించే బుద్దులు!
ఒక్కసారి తెప్పరిల్లు !
కృంగదీసే కుటిలతనుండి 
బైట పడే ఉపాయం చూసుకో 
జీవితం జిగేల్ మని మెరవక్కర్లేదు... 
కనీసం స్వేచ్ఛగా మాట,తిండి,ఆలోచన చాలు!!
ఒత్తిడి వదిలించుకోవాలి!!
కామెంట్‌లు