సు (నంద) భాషితం ;- సునంద వురిమళ్ల,ఖమ్మం

 మౌనం అప్పుడప్పుడు అవసరం.. ఎందుకంటే *మనలోకి మనం అంతర్వీక్షణ చేసుకుంటూ మన గురించి  ఆలోచించడానికి ,మనమేంటో తెలుసుకునేందుకు, మనలోని లోపాలను సరిచేసుకుంటూ
మనల్ని మనం పుటం పెట్టుకొని బంగారంలాంటి వ్యక్తిగా మనగలిగేందుకు మౌనం ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాదు కుటుంబంలో ఇరువురి  కోపతాపాల మధ్య మాటా మాటా పెరిగే సందర్భంలో
ఎదుటి వారి అహాన్ని అణచివేసేందుకు మౌనం మహా ఔషధంగా పనిచేస్తుంది
 ఉషోదయ నమస్సులతో

కామెంట్‌లు