గజల్ -డాక్టర్ అడిగొప్పుల సదయ్య
తనువెల్ల పులకించె తలపుతో ప్రియసఖీ!
తేలికై తేలేను గాడ్పుతో ప్రియ సఖీ!

నీ రాక నను లేపి నిదుర దూరము చేసె
సుమగంధ వీచికల మలుపుతో ప్రియసఖీ!

ఆకలేయదు నీవు లేకుంటే నా దాపు
కడుపు నిండును నీదు పిలుపుతో ప్రియసఖీ!

నీ దరిన లేకుంటె నిలువదే నా మనసు
నిను జేర వచ్చునే వలపుతో ప్రియసఖీ!

ఇక నుండి నిన్నొదిలి ఎటుపోను నా "మహతి"
నిదురింతు నీ ఒడిన అలపుతో ప్రియసఖీ!

సాహితీ చక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125


కామెంట్‌లు