జ్ఞాపకాల ముచ్చట్లు:-సత్యవాణి కాకినాడ
 మా నాన్న పెద్ద భూకామందు.వంద కాళ్ళ పశువులున్న కళ్ళంలో ,మావిడి చెట్లు,కొబ్బరిచెట్లు, యింకా యేవేవో చెట్లు, మాకు గల యేవేవో, పొలాల్లో వున్నాయి కానీ,ఒక్కటంటే ఒక్క గోరింటాకు చెట్టు లేదు.నా చిన్నతనంలో అది నాకుా,నా చెళ్ళెళ్ళకు ఒక పెద్ద లోటు, యెందు కంటే ఉండ్రాళ్ళ తద్దికీ, అట్లతద్దికీ, గోరింటాకు కోసం మా పాలికాపులను వారం పది రోజుల ముందునుండీ ,పీకి పిండెడితే,వాళ్ళు మా లోబీడు కళ్ళం ప్రక్కనున్న రాయణం దొరగారి ఖళ్ళం నుంచి , మాగొడవ భరించ లేక  అడిగో ,అడక్కో తెచ్చి పడేస్తే,
మా సుదరి పిన్ని రోటి దగ్గరకొచ్చేలోపుగా, రవణగారి కొట్టుమీదనుంచి  కవిరి, ఆదుంగనుా ,ఈ దుంగనో వెతికి కాకి బొడ్డుా, ఏడు చూరుల తాటాకు ముక్కలు,
మరో ఏడు చూరుల లోంచి ,బూజూ సంపాదించి మాపిన్ని రుబ్బే రోలులో వేసి, పిన్ని చెయ్యి ఎలా పండుతుందా అని ఆందోళన పడి పడి ,హమ్మయ్య పిన్నిచెయ్యే అంత బాగా పండితే ,నాచెయ్యింకెంత బాగుంటుందో, అయినా, పిన్ని గోరింటాకులో సారమంతా రుబ్బుతున్నానన్న వంకతో తనచేతికే పట్టించేసుకొంటోందేమోనన్న ఆందోళన,
అందుకే తన చెయ్యి అంతబాగా పండుతోందన్న అపోహ,
అయినా సరే , పిన్నినేమనకూడదు,ఎందుకంటే పినైతేనే గొరింటాకు నాజూగ్గా, అందంగా పెడుతుంది..అదే అమ్మైతే, తాటికాయంత చందమామ పెట్టి,తట్టెడంతంత చుక్కలను పెడుతుంది.
                సాయంత్రం నాలుగంటలకు బడినుంచి రాగానే మొదలెటితే గోరింటాకు పెట్టడం రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలదాకా,హరికెన్ లాంతరు గుడ్డి వెలుగులో సాగేది. పోట్లాడి
రెండుచేతులకు  గోరింటాకున్నాకా ,తల దురదేస్తోంది కొంచెం గోకవా? దాహం వేస్తోంది మంచి నీళ్ళు పట్టించవా? వ్రేలు చూపించి, బొందులాగు ముడిప్పవా అంటూ ,అమ్మని విసిగించడం,కాదంటే పెట్టించుకొన్న గొరింటాకు తీసేస్తామని అమ్మకేదో వుధ్ధరింపన్నట్లు  బెదిరింపులు,
ఎందుకోవిడా?వాళ్ళకు రెండు చేతులకీ పెడతావ్ ?వాళ్ళుంచుకొంటారనే ,నీ పిచ్చీగానీ,అమ్మ పిన్నికి హెచ్చరికలూ,మద్యలో అన్నయ్య,తన చిటికెన వ్రెేలికి చిట్టంత పెట్టమని పిన్నిని సతాయింపులు,అలా మగవాళ్ళంతా, చిటికెన వ్రేలటూ వస్తే ,మాక్కెడ గోరింటాకు  ముద్దతరిగిపోతుందేమోననే ఆందోళన , అలా గోరింటాకు పెట్టడం, ఆ ఘట్టం పూర్తవ్వగానే ,పిన్ని పెద్ద కంచంలో అందరికీ కుంభంలా  ఆవకాయతో కలిపి, తాటికాయలంత ముద్దలు కలిపి నోట్లోకుక్కుతూ,మద్యలో వెన్న నంచబెడుతూ వుంటే ,మేం లొట్టలేసుకొంటూ తినే ఆ ముద్దలే వేరు,
[10/8, 5:42 PM] Kkd Satyavani: గోరింటాకు పెట్టుకొనేదాకానే సరదా! తీసేసి ఎలా పండిందొ చూసుకోవాలనే సరదా అంతకు మించింది. ఆపై రెండుచేతులనూ ఉపయోగించి చేసే అవసరిలెన్ని జ్ఞాపకానికొస్తాయో చెప్పలేం.నిమిషానికొకసారి తీసేయాలనే ఉబలాటం,తీసేవా మరెప్పుడూ నేను నీకు గోరింటాకు పెట్టనన్న పిన్ని అదిలింపులు మొత్తినికిపాత బొంతలపై పవళింపులు గోరింట మరకలంటకుండా పడకలపై పవళింపులు .
[10/8, 5:42 PM] Kkd Satyavani: గోరింటాకు పెట్టుకొనేదాకానే సరదా! తీసేసి ఎలా పండిందొ చూసుకోవాలనే సరదా అంతకు మించింది. ఆపై రెండుచేతులనూ ఉపయోగించి చేసే అవసరాలెన్నెన్ని, జ్ఞాపకానికొస్తాయో చెప్పలేం.నిమిషాని కొకసారి తీసేయాలనే ఉబలాటం,తీసేవా మరెప్పుడూ నేను నీకు గోరింటాకు పెట్టనన్న పిన్ని అదిలింపులు, మొత్తానికి,పాత బొంతలపై  గోరింట మరకలంటకుండా  పవళింపులు .
[10/8, 5:42 PM] Kkd Satyavani: గుస గుసగా కబుర్లాడుకొంటున్న మమ్మల్ని ,పడుకోండి పిల్లల్లరా! మళ్ళీ తెల్లారకుండా లేవాలి అని అమ్మ అదిలింపులు,పడుకోండమ్మా ! మళ్ళీ లేవలేరు, ఆటల్లో ఓడిపోతారు నాన్న బుజ్జగింపులు ,మరైతే మమ్మల్ని ముందుగా లేపాలని  మా కండిషన్లూ, ఎప్పుడు తెల్లవారుఝామౌతుందా ,అని మా ఆతురతలూ,పట్టీ పట్టని నిద్దరలూ, ఆ నిద్దరలోనే, ఆటలాడుతున్నట్లు,ఉయ్యాలలూగుతున్నట్లూ, ఉప్పుబుట్టలు త్రిప్పుతున్నట్లూ అన్నీ కలలే! ఉలిక్కిపడి లేవటాలు ,యింకా ఎంతో అవ్వలేదమ్మా !పడుకోండి,నేను లేపుతాను నాన్న బ్రతిమాలటాలు.
                   రాత్రి   పన్నిండు గంటల లోపు పదిసార్లు లేవటాలు ,పడుకోవడాలు,హమ్మయ్య అయ్యింది తొలిఝాము.అమ్మలేపింది,చద్దన్నంలో నూపొడి, ఉల్లిపాయ పులుసు నంచితే బెత్తెడే గదా స్వర్గానికీ దూరం.ఆపై గడ్డపెరుగులో గొంగూర పచ్చడి నంజినప్పుడు  అమృతమట, అదేదో దీనీముందు బలాదూరే .
                  ఆపై వీధిలోకీ పరులు ,గోటేటారగుపై మీటింగులు, ఎవరి చెయ్యి ఎక్కువ పండింది? ఎవరెవరికి మంచి మొగుళ్ళొస్తారన్న వాదులాటలు,చిన్న బోవడాలు,చిన్నబుచ్చడాలు ,పొంగిపోవడాలు, పొంగించడాలు, అబ్బో ఏమని ,ఎన్నని చెప్పగలను?
[10/8, 5:42 PM] Kkd Satyavani: ఆడపిల్లలనేడిపించడానికి
ఆకతాయిల అఘాయిత్యాలు,పల్లేరుకాయలు పరచడాలు, టపాకాయలు పేల్చడాలు,తప్పుకొని పారిపోవడాలు, అన్నీ సరదాలే,అదోరకం సరసాలే!
                      ఆపై భక్తితో పూజలు ,రాబోవు భర్తకోసం కొందరూ,ఆల్ రడీ వచ్చేసిన భర్తకోసం ,వారి ఆరోగ్యంకోసం మరి కొందరు, అట్లు పంచడాలు ,ముత్తైదువులకు మ్రొక్కడాలు ,ఏడు ఉయ్యాలలూగడాలు, ఏడిళ్ళ గౌరమ్మలను కొలవడాలు, మేలమాడుకోవడాలు ,మొహం మాడ్చుకోవడాలు,అంతలోనే కలసిపోవడాలు ,నెచ్చెలులని కౌగలించుకోవడాలు ,మనసులో ఊసులు కలపోసుకోవడాలు అబ్బొబ్బో ఎన్నని చెప్పను? ఏమని చెప్పను మహా ప్రభో !అనుభవించాలి తప్ప ,అదంతా చెప్పలేను ,కొంతైనా చెప్పగలిగానా? ఏమో ,అనుమానమే!
                 

కామెంట్‌లు