అంశం:-గమ్యం;- ‌సత్యవాణి
 వెయ్ అడుగెయ్
మొదటి అడుగు వెయ్
గమ్యం చేరాలంటే
అసలడుగంటూ వేయాలికదా
వెయ్ అడుగెయ్
ఆలోచిస్తూ కూర్చోకు
మీనమేషాలు గుణిస్తూ కూర్చోకు
చీమకూడా
గంగాయాత్రని గమ్యంగా ఎంచుకొని కదలిందట
పిపీలకం కన్నా నీవెంత అధికుడివి
ఎన్నింటిలో అధికుడివి
మరి వెకడుగెందుకు
గమ్యం ఘనమైనదన్నప్పుడు
గగనానికైనా ఎగిరిపో
కాదు నావల్లని అనకు
కంటిమీద రెప్పవేయకు
గగనం చేరేవరకూ
అనుకున్నది సాధించు
ఆమడలెన్నని లెక్కలుగట్టకు
తూరుపు నీ గమ్యమై
పడమటకు పాదాలు కదపకు
లక్ష్యం ఒకటే 
గమ్యానికి దగ్గిరదారి
వెయ్ అడుగెయ్
మరిక ఆలస్యం చేయకు
గమ్యానికి చేరుకో
గగన తలంపై జండా ఎగరెయ్
                    

కామెంట్‌లు