చిరకాల మిత్రునితో ఓ ఉదయం ;-మంగారి రాజేందర్ జింబో

 ఓ వారం రోజుల క్రితం చిరకాల మిత్రుడు రవీందర్ ఫోన్ చేసి "యూఎస్"నుంచి వచ్చి రెండు రోజులు అవుతుంది ఒకసారి కలుద్దామా?"అన్నాడు. 
 "కొవిడ్ నిబంధనల్ని నువ్వు కాస్త సడలించినావా?"అని కూడా ప్రశ్నించినాడు రవీందర్ 
పోయిన సంవత్సరం వాడు వచ్చినప్పుడు  నేను ఏర్పరచుకున్న కోవిడ్ నిబంధనల వల్ల కలవలేకపోయాం. 
"తప్పకుండా కలుద్దాం" చెప్పాను రవీందర్ తో 
   "నిన్న ఫోన్ చేసి ఈరోజు గోల్ఫ్ క్లబ్ లో  బ్రేక్ ఫాస్ట్ చేద్దామని "అన్నాడు 
ఉదయం తొమ్మిది గంటలకి ఇద్దరము కలిశాం.బ్రేక్ ఫాస్ట్ చేసాం.చాలా విషయాలు మాట్లాడుకున్నాము. 
చిన్ననాటి స్నేహితులు ,స్కూళ్లలోని స్నేహితులు,ఇంటర్మీడియట్ స్నేహితులు, ఇట్లా ఎందరో సన్నిహిత మిత్రులు ఉన్నారు కానీ మా ఇద్దరిదీ విభిన్నమైన స్నేహం. ఎందుకంటే- 
 కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ గవర్నమెంట్ కాలేజీలో  ఇద్దరమూ కలిసి బీయస్సీ చదువుకున్నాం .
ఆ తరువాత ఉస్మానియా  యూనివర్సిటి లా కాలేజీలో ఎల్.ఎల్.బి చదివాం. తరువాత బీ.సి.జే.చేసాం. 
వాడు డే స్కాలర్ గా ఉండేవాడు నేను హాస్టల్ లో ఉండే వాడిని .నారాయణగూడ లోని తాజ్ లో తరచు కలిసే వాళ్ళం.ఆదివారం తప్పనిసరిగా సాయంత్రం కలిసేవాళ్ళం ఎందుకంటే ఆ రోజు సాయంత్రం మెస్సు ఉండదు.
రవీందర్  వాళ్ళ చిన్నాయన కలిసినప్పుడల్లా కాంపిటీటివ్ పరీక్షలు రాయండి అని మా ఇద్దరికీ సలహాలు ఇచ్చే వాడు. ఇద్దరమూ తలలు ఊపే వాళ్ళం. న్యాయవాదిగానో న్యాయమూర్తి గానో స్థిరపడాలని నాకూ,అమెరికా వెళ్లిపోవాలని రవీందర్ కి ఉండేది.
రిజల్ట్స్ రాకముందే జర్నలిజంలో మేమిద్దరమూ మరో మిత్రుడు శ్రీధర్ జాయిన్ అయినాం. 
డిసెంబర్ 24 1981లో ఇద్దరమూ న్యాయవాదులుగా నమోదైనాము. 82 లో నా వివాహం జరగడంతో నేను కరీంనగర్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టడం జరిగిపోయింది.
రవీందర్ కొంతకాలం ప్రాక్టీస్ చేసి వాడి లక్ష్యం అయినా అమెరికా కి వెళ్ళిపోయాడు.అక్కడే కాలిఫొర్నియా లో స్థిరపడ్డాడు. 
నేను కరీంనగర్ నుంచి సిరిసిల్ల కి స్వతంత్ర న్యాయవాదిగా ప్రయాణం చేసి ఆ తర్వాత న్యాయమూర్తిగా మారిపోయాను.
తిరుపతిలో నేను మేజిస్ట్రేట్ గా పని చేసినప్పుడు.
 ఆ తర్వాత రవీందర్ ప్రతిసారి ఇండియాకు వచ్చినప్పుడు తప్పక కలిసేవాడు. అలా మా స్నేహం కొనసాగుతూ వచ్చింది.
ఈరోజు ఇద్దరమే ఉండటంవల్ల కాలేజీ ముచ్చట్లు,యూనివర్సిటీ విషయాలు,మిత్రుల విషయాలు,కుటుంబ విషయాలు ఇట్లా ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాం.రెండు గంటలు అలా గడిచిపోయాయి.
గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన మేమిద్దరం మా లక్ష్యాలు చేరుకున్నామా అని పశ్నించుకున్నాము. నవ్వుకున్నాం.
చాలా మంది మిత్రులు ఉన్నప్పటికీ డిగ్రీ,లా,జర్నలిజం కోర్సులని కలిసి ఇద్దరమూ కలిసి చదువుకోవడం చాలా విచిత్రమయిన విషయం.
ఇంటర్మీడియట్ మిత్రులు చాలామంది డిగ్రీ నాతోపాటు చదవలేదు.డిగ్రీ చదివిన మిత్రులు నాతోపాటు లా చదవలేదు.లా చదివిన మిత్రులు  నాతోపాటు జర్నలిజం చదవలేదు. అలా కలిసి చదువుకున్న మిత్రుడు రవీందర్.
 మా ఇద్దరి లక్ష్యాలు వేరు. నేను న్యాయవాదినో న్యాయమూర్తినో కావాలని అంతే కాదు పెద్ద రచయితని  కావాలన్నది నా లక్ష్యం.
వాడు US కి వెళ్లిపోవడం అతని లక్ష్యం.
ఇలా  ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కాలేజి ముచ్చట్లు చెప్పుకున్నాము. బిగ్గరగా నవ్వుకున్నాము. 
మరి కొంతమంది మిత్రులతో మళ్ళీ కలుద్దామని అనుకొని సెలవు తీసుకున్నాం .
అప్పుడు తీసుకున్న ఫోటో ఇది .
కామెంట్‌లు