జాతిపిత కు స్మృత్యంజలి :- పరికల్పన : రామానుజం. ప

 మోహన్ దాస్  కరమ్ చంద్  గాంధీ  జీ !!      జయంతి   సందర్భంగా    !
సీస   పద్యం   : 
జాతిపిత  , మహాత్మ  , బాపూజి , గాంధీజి  ;
         సేవ  తత్పరుడేను ;  స్వీ  యపేక్ష  , 
అధికార   లబ్ధిని    ఆశించకను ;  కట్టె
        కుళ్ళాయి  ;  త్రాగె మేక లిడు  పాలు ;
గ్రామాభ్యుదయమునే  కాంక్షిస్తు  , బడుగు  వ
           ర్గాల  వారభివృద్ధి --  రయము గోరె ;
శాంతి  , అహింసలే   ఆయుధాలుగ  చేసి, 
               తెల్లవారలనెల్ల      వెళ్ళ గొట్టె   ;
తేటగీతి   :
ఉద్యమంగా   విదేశ  వస్తువుల  విడచె  ;
ఉప్పు  సత్యాగ్రహము; రాట్న మువడకుటయు;
కాంగ్రెసున  నాయకుల  చేర్చి  , కదమునిడుచు, 
లోక మందు    భారతదేశ     పుటము చాటె    !! 
~~~~🙏~~~~~
జననం :02-10-1869🌺30-01-1948 :మరణం
           
మన పూర్వ  ప్రధాని  శ్రీ  లాల్ బహదూర్  శాస్త్రి వారి జయంతి సందర్భంగా  🌹🙏 పుష్పాంజలి
కామెంట్‌లు