*శ్రమజీవులు*(ఆటవెలదులు):-*మిట్టపల్లి పరశురాములు*

శ్రామికులకునిలన-సతతముకష్టాలు
సుఖము లేదునెపుడు-జూడరయ్య
కూటికొరతచేత-కుంగేరువారలు
జాలిజూపరెవరు-జగతియందు

కండలొంచి పనులు- దండిగాజేసేరు
కుండ నిండదెపుడు-కూటికొరత 
కడుపుసగమునిండు-కన్నీళ్ళపర్వంబె
రాత ఫలమొవారి-  రాజ్యమందు

పిల్లజెల్లపనులు- నెల్లరుజేసిన
కల్లబొల్లిబతుకు-కాదుసుఖము
చెమటదోచెవారు-జేయునుద్రోహంబు
వారెమూలమోయి-వసుధయందు

మట్టిలోనపోర్లి-మాసినవస్త్రాల
గోసిగుడ్డతోడ-కూలిజేయు
నీటికొరతతోడ-నిత్యంబునుండును
కూడుదొరకకున్న-కుమిలియేడ్చు
               . ****

కామెంట్‌లు