శ్రీ మహా భాగవత పోతన మణిపూసలు....వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సిద్దిపేట.
మమ్ము దీవించ కోరెదము 
లోభ మోహంబును మోదము 
ఉత్తర జన్మలో శుభములు 
కలుగునట్లును దీవించుము       7901 

సర్వేషుడు కలకలమాలకించి 
ఏకాంత కలాపాలు చాలించి 
అంతఃపురము దాటి  యివతలకి 
వచ్చి దర్శణమివ్వ సంతషించి        7902 

శరనిధి కన్యకామణియు లక్ష్మి 
మనోహర నిజ లీలమై లక్ష్మి 
తోడు వచ్చి మ్రొక్కె పరమహంసల 
పాద పంకరూహములకు లక్ష్మి        7903 

పూజనీయులు నమస్కరించగా 
యోగీ జనులు సేవిస్తుండగా 
పరమేశ్వరుడు శ్రీహరి 
మునీశ్వరులకు ప్రసన్నుండవగా   7904 

కరకంకణ కాంచనలు ఘల్లుమన 
అచ్చరలిడు హంసిత చామరమున 
గంధవహచ్చలత్సు ధాకర 
రుచి రాత పత్ర సుభగ  విలంబన         7905  

హారవల్లరి సరపగళ తుషార 
మహా విరాజిత మంగళాకార 
నయనానంద కరంబాయె 
హృదయపు కుహరాలలో అలరార 7906 

మ్రొక్కినట్టి జనులను కరుణించును 
కృపామృతము కన్నుల వర్షించును 
యోగేంద్రులు సేవింప తగునట్టి 
సమస్త భువనాలకు యోగ్యుండును    7907

కటి విరాజిత పీత కౌశేయ 
వితత కాంచనా గుణం ద్వుతీయ 
నాలాంబిక కంఠ హారావళి 
ప్రభలతో కౌస్తుభ రోచు లీయ         7908 

నిజ కాంతీ జితతటి ద్వ్రజముల 

ర్ణ కుండల రుచి గండ ద్యుతుల 
నవరత్నమయ  కిరీట ప్రభానిండ నిచయంబు దిక్కుల            7909 

కలిత కేయూర కంకణమొప్పను 
అన్య కరతలము భ్రమణీకృతాను 
వైనతేయ విన్యస్త వామ హస్త 
సుందర లీలారవింద మమరను           7910 

..........

కామెంట్‌లు