సద్దుల బతుకమ్మ ; రామ్మోహన్ రావు తుమ్మూరి

 తంగేడు పువ్వుల్లు ఉయ్యాలో
తపుకులోన పేర్చిఉయ్యాలో
గునుగు పువ్వులు దెచ్చి ఉయ్యాలో
గుత్తులుగుత్తులు బేర్చిఉయ్యాలో
గుమ్మడి పువ్వులుదెచ్చి ఉయ్యాలో
గుండ్రంగ బేర్చి ఉయ్యాలో
కట్లె పువ్వులు దెచ్చి ఉయ్యాలో
కట్లు కట్లు బేర్చి ఉయ్యాలో
బీరాకు పొట్లాకు ఉయ్యాలో 
పొత్తి కడుపుల నింపి ఉయ్యాలో
ఈ పువ్వు ఆపువ్వు ఉయ్యాలో 
అక్కడిక్కడ జెక్కి ఉయ్యాలో 
పసుపు గౌరమ్మనూ ఉయ్యాలో 
పైన పువ్వుల బెట్టి ఉయ్యాలో 
బంతి పువ్వులు దెచ్చి ఉయ్యాలో
బంగారు జడ జేసి ఉయ్యాలో 
ఈ పక్క ఆపక్క ఉయ్యాలో 
వేలాడగట్టిన్రు ఉయ్యాలో 
అందాల బతుకమ్మ ఉయ్యాలో 
ఆడోల్లు బేర్చిన్రు ఉయ్యాలో 
అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
కామెంట్‌లు