కన్నవారు వేల్పులు;---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
కన్నవారు భాగ్యము
సదనములో క్షేమము
వారి ప్రేమ శ్రేష్టము
గుణనుజూడ హేమము

కనిపించే వేల్పులు
నిజమైన ప్రేమికులు
ఇంటియందు వెలుగులు
కన్నవారు శుభములు

వారుంటే బ్రతుకులు
వర్ధిల్లును గృహములు
ఇంట తల్లిదండ్రులు
లేకుంటే తిప్పలు

కన్నవారి సేవలు
చేకూర్చు దీవెనలు
జీవితాన ఫలములు
సేదదీరు మనసులు


కామెంట్‌లు