కథ;- సత్యవాణి
   ఆనగా అనగా ఒక బాగా బలిసిన దున్నపోతుంది.అది అతిగా బలియడం చేత, అహంకారం ఎక్కువై, సాటి దున్నలను కూడా లెఖ్ఖచేయకుండా కలబడేది.కొమ్ములతో  కు మ్మేది.ఒకటికి రెండుసార్లు దున్నటానికి కాడి మెడమీద పెట్టగానే, రైతు ని కూడా కుమ్మాలని చూసింది దానితో రైతుకు బాగా ఒళ్లు మండి దానిని బాగా కొట్టి వదిలి పెట్టేసా డు.
     దానితో అది స్వేచ్ఛగా అడవిలోకి వెళ్లి బాగా మేసి బలిసింది. అడవిలో ని చిన్న చిన్న జంతువులతో  అకారరణంగా తగవుపెట్టుకొని, తన  బలంతో గెలిచేది. దేని నీ లెఖ్ఖ పెట్టేది కాదు.  చిన్నచిన్న  జంతువులు  లేవీ దనికి ఎదురు పడేవికావు.
    ఒకరోజు అది ఒంటరిగా అడవికి మేతకు వెళ్ళింది. అలా మేతమేస్తూ మేస్తూ, అడవి లోపలికి వెళ్ళిపోయింది.అక్కడ  ఒక సింహాల గుంపు ఈ దున్నపోతుని చూశాయి. బలిసిన ఈ దున్నపోతు ని చూసి," ఆహా మంచి ఆహారందరికిందీరోజు అని లొట్టలు వేసాయి. బలిసిన తన మీదకి సింహాలు అన్నీ ఒక్కసారిగా దాడి చేశాయి.
అంత బలమైన దున్నా సింహాల గుంపును ఎదిరించలేక దీనంగా అరవసాగింది.
     అడవిలో  మేత మేస్తున్న రైతు యొక్క మిగిలిన దున్నలు, తమ మకాంలో వుండే దున్న అరుస్తున్న  అరుపులు వాటికి దీనంగా విన్పించాయి.ఆంతే,ఒకటి తర్వాత ఒకటిగా పరిగెత్తుకొని మొత్తం  దున్నపోతులన్నీ వచ్చి, సింహాలగుంపుపై దాడి చేసాయి. తమ వాడి అయిన బారు కొమ్ములతో
సింహాలను పొడి చేయి. ఎత్తి కుదేసాయి. దూరంగా విసిరి వేశాయి . ఐకమత్యంగా దున్నలు చేస్తున్న పోరాటంలో సింహాలు ఓడిపోయేయి. తోకలు ముడుచుకుని అడవిలోకి పరుగులు తీశాయిసింహాలు
       అడగకుండగనే వచ్చి , తన ప్రాణాలు కాపాడిన దున్నలను చూసి, ఇది వరకు తాను వాటితో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి   సిగ్గు పడింది బలిసిన ఆ దున్న. బలుపువలనే తనకు పొగరు బలిసి, ఆపద కొనితచ్చుకొన్నానన్న విషయం గ్రహించి, సాటి దున్నలతో కలసి రైతు కమతంలోచేరి,పనిపాటలు చేసుకొంటూ ,సాటి వాటితో స్నేహంగావుంటూ జీవితం హాయిగా కొనసాగించింది ఆ దున్నపోతు.
              

కామెంట్‌లు