ఉయ్యాల పాట:-యెల్లు అనురాధ రాజేశ్వర్రెడ్డి--సిద్దిపేట
రామ రామ రామ ఉయ్యాలో
 రామనే శ్రీరామ ఉయ్యాలో
 రామన్న వారికి ఉయ్యాలో
 రావు కష్టాలు ఉయ్యాలో

 శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో
 ఇంటికొస్తే ఉయ్యాలో
 పసుపు కుంకుమ తోడ ఉయ్యాలో
 ఆహ్వానిస్తాం ఉయ్యాలో 

శనివారం లక్ష్మి ఉయ్యాలో
 మా ఇంటికొస్తే ఉయ్యాలో
 చీర సారే తోడ ఉయ్యాలో
 ఆహ్వానిస్తాను ఉయ్యాలో

 ఆదివారం లక్ష్మి ఉయ్యాలో
 మా ఇంటికొస్తే ఉయ్యాలో
 అద్దాల చీరతో ఉయ్యాలో
 ఆహ్వానిస్తాను ఉయ్యాలో

 సోమవారం లక్ష్మీ ఉయ్యాలో
 మా ఇంటికొస్తే ఉయ్యాలో
 తీరైన సొమ్ములు ఉయ్యాలో
 అమ్మకే ఇస్తాను ఉయ్యాలో

 మంగళవారం లక్ష్మి ఉయ్యాలో 
మా ఇంటికొస్తే ఉయ్యాలో 
మంగళ హారతులతో ఉయ్యాలో
 ఆహ్వానిస్తాను ఉయ్యాలో

 బుధవారం లక్ష్మి ఉయ్యాలో
 మా ఇంటికొస్తే ఉయ్యాలో
 బుద్ధులెన్నో చెప్పి ఉయ్యాలో
 సద్దులైతే కడుతా ఉయ్యాలో

 గురువారం లక్ష్మి ఉయ్యాలో
 మా ఇంటికొస్తే ఉయ్యాలో
 గుడి కట్టి నేను ఉయ్యాలో
 ఆహ్వానిస్తాను ఉయ్యాలో


కామెంట్‌లు