ఇళయరాజా - ఇసై జ్ఞాని:-- విషయ సేకరణ: - యామిజాల జగదీశ్

 పాటలకు తన స్వరజ్ఞానంతో ప్రాణం పోసి వినేవారి హృదయంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజాను తమిళంలో ఇసై జ్ఞాని అంటారు. అంగీత సంగీత జ్ఞాని అని అర్థం.పద్మవిభూషణ ఇళయరాజా సంగతులు కొన్ని.... 
ఓ పాట రూపొందించడానికి విదేశాలకు వెళ్ళడమో, అందమైన లొకేషన్లో, వారం లేదా నెలల తరబడి కాలమో ఇళయరాజాకు అవసరం లేదు. తెన్డ్రల్ వన్దు తీన్డుంబోదు .....(గాలి కవ్వించేటప్పుడు....) అనే తమిళ పాటను స్వరపరచడానికి ఆయనకు ముప్పై నిముషాలు పట్టింది.ఇళయరాజా 12 గంటల్లో రీరికార్డింగ్ మొత్తం పూర్తి చేసిన తమిళ సినిమా - నూరావదు నాళ్! (వందో రోజు)
సిగప్పు రోజాక్కళ్ (ఎర్ర గులాబీలు) సినిమా రీరికార్డింగుకి అయిన మొత్తం ఖర్చు పది వేల రూపాయలు. అయిదుగురు సంగీత వాయిద్య కళాకారులతో మూడు రోజుల్లో ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.
సాధారణంగా సంగీతాన్ని చదివే చెప్తారు. కానీ ఈయన మాత్రం పక్కాగా నోట్స్  రాసి (నొటేషన్స్) వాయిద్య కళాకారులకు ఇస్తారు.
అమృతవర్షిణి అనే రాగానికో ప్రత్యేకత ఉంది. ఈ రాగంతో వర్షం రప్పించిన సందర్భాలు చరిత్రపుటలలో చూడొచ్చు. అయితే ఇళయరాజా తూంగాద వియిగళ్ రెండు....అనే పాటను రూపొందించారు. అంటే నిద్రపోని కళ్ళు రెండు...అని అర్థంతో కూడిన పాట.
సినిమాలో రీతి గౌళ అనే రాగాన్ని మొదటిసారిగా ప్రయోగించారు. కవిక్కుయిల్ (కవి కోకిల) అనే సినిమాలో చిన్న కణ్ణన్ అయయైక్కిరాన్...అనే పాటను ఈ రాగంలో స్వరపరిచారు. 
భారత చలన చిత్ర పరిశ్రమలో గాయత్రి అనే సినిమాలో మొదటిసారి ఇసైజ్ఞాని ఇళయరాజా ఎరక్ట్రిక్ పియానో ఉపయోగించారు.
సెంజు సురుట్టి రాగంలో సంగీతాన్ని స్వరపరచిన ఏకైక పాట "ఆట్టుక్కుట్టి ముట్టయ్ ఇట్టు...."(మేక పిల్ల గుడ్డు పెట్టి...)
16వయదినిలే (పదహారేళ్ళ వయస్సులో) అనే సినిమాలోదే ఈ పాట. కవి కణ్ణదాసన్ ఈ పాటను ముప్పై నిముషాల్లో రాసిచ్చారు.
ప్రపంచులో మరే సంగీతదర్శకుడూ చేయని ప్రయోగం ఆయన చేశారు. ఓ సంగీతదర్శకుడు అప్పటికే సంగీతం సమకూర్చి, పాట రాసి, దాని సౌండ్ ట్రాక్ ని తప్పించి ఆ సన్నివేశాన్ని మాత్రం అలాగే ఉంచి పెదవులు కదపడం, శరీర కదలిక, సన్నివేశానికి తగినట్టు కొత్త సంగీత నొటేషన్స్ రాసి వీనులవిందైన పాటను అందించిన ఘనత ఆయనది. ఆ చిత్రం పేరు హేరామ్. 
ఒక రీల్ స్క్రీన్ మీద చూస్తే చాలు నొటేషన్స్ రాయడం మొదలుపెడతారు.ఆ నొటేషన్స్ చదువుకుంటే సరిపోతుంది ట్యూన్ మొత్తం క్షణాల్లో రెడీ అయిపోతుందన్న మాట.
ఆసియాలో మొదటిసారిగా సంఫొనీ సంగీతాన్ని సమకూర్చారు ఇళయరాజా. సంఫొని కంపోస్ చేయడానికి కనీసం ఆరు నెలలవుతుంది. కానీ ఈయన పదమూడు రోజుల్లో పూర్తిచేసి ఇతర కంపోజర్లను ఆశ్చర్యపరిచారు.
విజిల్ (ఈల)తో ట్యూన్ చేసి దానిని రికార్డు చేసి తర్వాత గాయకుడితో పాడించిన పాట కాదలిన్ దీపం వొన్డ్రు....
సినిమా కథను వినకుండానే పాటకు సంబంధించిన పరిస్థితులను మాత్రం విని సంగీతాన్ని సమకూర్చిన ఏకైక చిత్రం కరగాట్టక్కారన్.
ఓ సినిమాకు నేపథ్య సంగీతాన్ని సమకూర్చే ముందర ఒకటికి రెండు సార్లు ఆ సినిమాను చూస్తారు. మూడోసారి స్క్రీన్ మీద చూడటం మొదలు పెట్టగానే నోట్స్ రాయడం ఆరంభిస్తారు. ఆయన రాయడం ఆరంభించి పూర్తి చేసేసరికి సరిగ్గా అదే సమయానికి సినిమా కూడా పూర్తవుతుంది. ఆ మేరకు మరే సంగీత దర్శకుడు కచ్చితమైన నోట్స్ రాయడం అనేది ఊహకు అందని విషయం.
భారతదేశంలో నేపథ్య సంగీతం క్యాసెట్టుగా వచ్చి హిట్టయిన ఒకే సినిమా పాట - పిళ్ళయ్ నిలా పరువమే. పుదియ పాడల్ పాడు అనే పాటకు తొడపై తడుతూ తాళానికి కొత్త పరిణామాన్ని సృష్టించిన సంగీళజ్ఞాని ఇళయరాజాశమ.
భారత దేశంలో మొదటిసారి ఉత్తమ నేపథ్య సంగీతానికిగాను అవార్డు పొందిన వారు ఇళయరాజా. ఆ సినిమా పేరు - పయసిరాజా.
ఇళయరాజా మొదటిసారి స్టీరియో పద్ధతిలో పాటలను రికార్డు చేసిన చిత్రం - ప్రియా. 137 వాయిద్యాలను ఉపయోగించిన పాట - సుందరి కన్నాల్ ఒరు సేది...! ఆయన పాట కోసం కథ రాసి విజయం సాధించిన చిత్రాలు - వైదేహి కాత్తిరుందాళ్, అరన్ మనైక్కిళి.
భారతదేశానికి కంప్యూటర్ సంగీతాన్ని పరిచయం చేసింది ఆయనే. పుణ్ణగై మన్నన్ అనే సినిమా. 
ఇలా ఎన్నో ఎన్నెన్నో విషయాలు ఆయన సంగీత ప్రపంచంగురించి చెప్పుకుంటూ పోవచ్చు.

కామెంట్‌లు