గమనించు;- సత్యవాణి

పొగడ్తలకు పొంగిపోకు
తెగడ్తలను గమనించు

నిన్ను నువ్వు పొగుడుకోకు
నిందలెన్నొ గమనించు

అడుగు వేయు ముందుగానే
అగడ్తలను గమనించు

ప్రోత్సహించువాడొకడే
పడదోయువారెందరొ

భజన పరుల బాట పట్ట
భంగ పడుట తద్యములే

అడుగడుగున వేయి కళ్ళు
అవలోకించును సదా

అపహాస్యపు పాలుగాక
ఆచరించు సన్మార్గం

వటవృక్షంవంటి నీవు 
వాలబోకు నేల పైన

గూడు కట్టిన పక్షులన్ని
గుండె చెదిరి కూలునులె

చెట్టు కూలదోయువారు
చుట్టూతా వున్నారు

మంచేదో చెడ్డేదో
మనసుపెట్టి గమనించు

ప్రజల మాట చెవిన పెట్ట
ఫలితమెంతొ సుగమనము

చెదపురుగులనేరివేయ
చెట్టుకు కెపుడు సురక్షితం

వేయి ఏండ్లు సురక్షితంగ
వెలుగగలదు భువిపైన

               
కామెంట్‌లు