శ్రీ మహా భాగవత పోతన మణిపూసలు :-..వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సిద్దిపేట

జగదంతర్యామి నిర్గుణుండు 
నిష్కాముండును భక్త సులభుండు 
పరమేశ్వరునకు మ్రొక్కెద 
రక్షించు గాతయు మన్నించుడు     7841 

దితియు అర్భకులు లేని దగుటను
గర్భము దాల్చె నాథుని వలనను 
కమలాసనకావిర్భూతమైన 
నెలకొనె నిర్భర సంతోషమును     7842 

సతి గర్భానికి సంతోషించక 
ఆత్మ స్రుక్కుచును తప్పును నచ్చక 
నిజతలోదరిని జూచి 
కశ్యపుండు నిట్లనె తానొప్పక      7843 

ఓ సతి! లోకనిందకు భయపడక 
మదనుని ప్రేరణ తట్టుకోలేక 
లజ్జ భయము ధర్మాన్ని విడిచి 
దుశ్శీల వలె సంచరించితివిక    7844 

అట్లగుటను జేసి..... 

సతి! విను భూత గణ ప్రేరితులై 
రుద్రానుచరుల పృథు శక్తులై 
భద్రుడు అనుభద్రుడు పేర్లతో 
కొడుకులు పుట్టి ఉగ్ర కర్ములై          7845 
 
అతి శౌర్యతంబులును జూపుతు 
నిరతంబును ధరణిని వ్రేగుతు 
బుధ జీవన పీడా పరులై 
ఆత్మ గర్వమున వర్తించుతు       7846 

బలగర్వమున భూమికి భారమై 
దుష్కర్ములకు మహాత్ములేకమై 
హరికి విన్నవించ కోపించి 
హరి సంహరించు వజ్రాయుదమై      7847 

అనియును కశ్యపుడెఱిగించి నంత 
విని దితి విహ్వల మతియాయె నంత 
విగత కౌతుక యగుచున్ 
హృదయేశు ముఖాబ్జము జూసెనంత 7848 

స్వామీ! 

సజ్జన అపరాధ దుర్మార్గులకు 
ఆయువు,ధనము నశించి వారలకు 
మృతి చేకూరు శత్రువుల చేత 
ఎగ్గు సేయ భవదాత్ముజు లార్యులకు       7849 

భూ సురులు క్రోధాగ్నికి పాల్పడక 
తప్పు జేసిన పుత్రులు బ్రతకక 
శ్రీహరి చేతుల ప్రాణాలు 
కోల్పోవడము శుభమౌను కదయిక         7850 

..............
కామెంట్‌లు