బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 36) గులాబీ తనకు తెలియకుండానే పరిమళాన్ని వెదజల్లినట్లుగా, మనం ఇతరులకు దానం చేయాలి.
37) పేడదిబ్బపై ప్రకాశించినా సూర్యకిరణాలు మాలిన్యం కానట్లే,దృఢసంకల్పంతో ఉన్నవాడి మనసును ఎవరూ పాడుచేయలేరు.
38) విద్యార్థి దేశకల్యాణానికి మంగళతోరణాలు కట్టే విజ్ఞానమూర్తి.
39) చేసిన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నించకు. మంచిని పెంచుకుంటే తప్పులు తొలగిపోతాయి.
40) నీవు సర్వశక్తి సమన్వితుడవని నమ్ము.నీవు ఏమైనా చేయగలవు. ఆత్మవిశ్వాసంతో కృషిచేసి లక్ష్యాన్ని సాధించు.
(సశేషము)

కామెంట్‌లు