: బతుకమ్మ:-::యాళ్ళ ఉమామహేశ్వరి--తెలుగు అధ్యాపకురాలు

సాహితీ బృందావన జాతీయ వేదిక--ప్రక్రియ: సున్నితం--రూపకర్త::: నెల్లుట్ల సునీతగారు
------------------------
అమావాస్య నిశీధిలో సినీవాలి
తెలంగాణ ఆడపడుచుల పండుగిది
ఎంగిలిపూల బతుకమ్మతొ మొదలిది
చూడచక్కని తెలుగు సున్నితంబు....(81)

పసిడి వన్నెల తంగేడు
నువ్వుల పులగపు నైవేద్యంతొ
బతుకమ్మ బ్రతకనీయవమ్మ చల్లంగ
చూడచక్కని తెలుగు సున్నితంబు...(82)

అటుకుల బతుకమ్మ మరునాడు
జనమజనమల పాపాలు కడతేర్చు
చప్పిడిపప్పు బెల్లాల నైవేద్యమారగించు
చూడచక్కని తెలుగు సున్నితంబు...(83)

మూడు వరుసల పూవులమరిక
ముద్దపప్పు బతుకమ్మ మూడవనాడు
తెలంగాణ సంస్కృతికిది అద్దంపట్టు
చూడ చక్కని తెలుగు సున్నితంబు...(84)

నానేబియ్యపు బతుకమ్మ నాల్గవనాడు
నగునూరి రాజన్న రాక్షసపాలనలో
అమ్మనికోరె బతుకులీయమని నానుబియ్యమిచ్చి
చూడచక్కని తెలుగు సున్నితంబు...(85)

........................................
కామెంట్‌లు