*దళితజ్యోతి అంబేడ్కర్* *(మణిపూసలు)*;-*మిట్టపల్లి పరశురాములు
భరతమాతముద్దుబిడ్డ
దళితజ్యోతిపోరుబిడ్డ
మరువబోదుమాన్యచరిత
ఆత్మగల్లతెలుగుబిడ్డ

పుణ్యమూర్తిపూణలోన
పుట్టి అంబవాడలోన
పీల్చినాడుస్వేచ్చగాలి
స్వచ్చమైనమనసులోన

అంటరానితనమునాడు
అడుగడుగునతరుముచుండ
బాబమనసుకలతజెంది
పోరుజేయపూనినాడు

ఊరవతలమనవారు
ఎందుకుంచబడినారు
ధర్మసందేహమునబాబ
ఆలోచనచేసినారు

చిన్ననాడెతనహృదయం
కలతజెందెఅయోమయం
ముందుజరుగుఘోరములను
ఎదిరించిపొందవిజయం

బడిలోనతానుచివరన
గుడికినిచాలదూరమున
చదువుసంధ్యలేకబాబ
సన్నగిల్లెనుభారమున

పట్టుబట్టిచదివినాడు
పట్టములనుపొందినాడు
అంధకారశాసనాల
చెరిపివెలుగునింపినాడు

కులముగోడకూలదోసి
మానవతనువెలుగజేసి
జాతిరత్నమైజగతిని
దశదిశలనొకటిజేసి

రాజ్యాంగపుహక్కులను
రక్షజేసికాపాడగను
రాజ్యాంగరచనచరిత
తరతరాలుగనిలువగను

            ****


కామెంట్‌లు