అమ్మతో:-సత్యవాణి
అమ్మా!నన్నెందుకు ఈభూమిమీదకు తెచ్చావు
ఏ దుర్ముహుర్తంలో నేను ఈ నేలను పడ్డాను
ఈనాటి వరకూ,
ఈక్షణంవరకూ అనుకొనే అవకాశం నాకు కలుగకుండా పెంచారు నన్ను

ఈ క్షణం వరకూ నాఅంత
అదృష్టంవంతురాలు లేదనుకొన్నాను
కాలికి దుమ్మంటుతుందని
నాన్నా నువ్వూ అరచేతులలో
నడిపించుతూ పెంచారునన్ను
ఆడుకోవడానికీ
ఆత్మీయత పంచడానికి
నాకొక అందమైన చెల్లెల్నికూడా
యిచ్చారు
కంటిరెప్పవేస్తే
మీ కనుపాపలుగావున్నమాకు
ఎక్కడ నొప్పికలుగుతుందోనని
కంటిరెప్పలు వేయకుండా
కళ్ళలో దాచుకున్నారు
కోరిన చదువును చెప్పించారు
మా విజయాలను మీ విజలుగా భావించి
ఒకరి కనులలోకి ఒకరు గర్వగా
చూసుకొన్నారు నువ్వూనాన్నా
అందమైన అనురాగంపంచే
సహృదయునికి ఆనందంగా నన్ను
అప్పజెప్పాలని తపించారు
అంతా ఐపోయిందమ్మా
అరగంటలో మన ఆశలసౌధం
కూలిపోయింది
మీ అరచేతుల్లో నడచిన మీకూతురు 
ఈనాడు ఇలా మట్టి మశానంలో
వివస్త్రగా వేదనపడుతోంది
బాధంటే ఏమిటో తెలియనినేను
రాళ్ళరప్పలపైన
నొప్పి అని అరవడానికి లేకుండా
నోరు మూశాయమ్మా ఈ మృగాలు
తెల్లవారి వందసార్లు అమ్మాఅమ్మా అంటూ అల్లరిగా ఇష్టంగా
పిలిచే నిన్ను
అంతులేని బాధతో 
అమ్మా.......అని ఆక్రోశించడానికూడా లేకుండా
నా ముక్కూనోరూ మూశాశారమ్మా ఈ దుర్మార్గులు

అయినా నా ఊపిరి ఆగేంతవరకూ నా
అంతరంగంలోనే
అమ్మా అమ్మా అమ్మా అంటూ
ఆక్రోశిస్తూనేవున్నానమ్మా 
మీరు నాకన్నీ యిచ్చేరు
మీకు నేనేమీ ఇవ్వలేకపోయేను
సరిగదా
అంతులేని వేదనను మిగిల్చేను
ఆత్మ సంతృప్తితో ఆనందంగా బొమ్మరిల్లువంటి మన ఇంటిలో
గుట్టుగా గువ్వపిట్టల్లా వున్న మనజీవితాలు
ఈనాడు మనప్రమేయంలేకుండానే
నడివీధిలో నలుగురూ చర్చించుకొనే దశకు చేరుకొన్నాయి
అది మనపైనజాలితోనైనా 
ఇలాంటికష్టం నష్టం
మరోఆడపిల్లకు రాకూడదని
నువ్వు నిత్యంకొలిచే నీదేవుడిని ప్రార్థించు
క్షమించమ్మా
ఎన్నెన్నో చెప్పాలనివున్నా
ఇంక నా జీవన పోరాటం ఆగిపోతోందమ్మా
ఆగిపోయినప్పుడే 
నేననుభవించే ఈ చెప్పలేని
చెప్పుకోలేని బాధ అంతమౌవుతుంది
ఆఖరి సారిగా మనస్పూర్తిగా అమృతమయమైన 
నిన్నుతలుస్తూ....,,,భావనలోనినుచూస్తూ
అమ్మా..,,....., సె.,ల..వు

కామెంట్‌లు