శ్రీ మహా భాగవత పోతన మణిపూసలు ;-......వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సిద్దిపేట.
యోగమాయా విభూతి చేతను 
ప్రఖ్యాతిని పొందినట్టి నేను 
భూసురుల పాదరజస్సు నంత 
భక్తి వన తలపై ధరిస్తాను 7931 

అట్టి చరణ పద్మాల పుట్టిన 
గంగా జలమునంత శిరస్సున 
ధరించు పరమశివుడు దేవతలు 
పునీతులై తరించ వేడగను         7932 

బ్రాహ్మణులను నన్ను గాను 
విప్రులంత అపకృతులను 
జేసినను అలాగని వాడు నాకు 
అత్యంత ప్రియుడును       7933 

నన్నును దీన కోటి వర్గమును 
ధరా దివిజకోటి గోవితతిను
వావిరి బేధబుద్ధి గల వారలు 
అతి నీచమైన స్థితిని పొందును       7934 

విషపాముల వలె యమభటులును 
ఉగ్రమైన గ్రద్దల వోలెను 
ముక్కులతో వాళ్ళ యొక్క 
అవయవములు నన్నియు చీల్చును 7935 

బ్రాహ్మణోత్తములు పరాభవించిన 
ధర హసితాస్యులై యతి ముదంబున 
పూజ జేయుచు గౌరవించెద 
దైవసమము ప్రేమగాను మసలిన          7936 

పాప రహితులకు ప్రియతముండను 
భక్తి వలన అమ్ముడుపోయెదను 
భృగు మహర్షి తన్నగా 
స్వీకరించితి సంతోషముగను   7937 

గర్విష్ఠు లైనట్టీ వీరలు 
తెలుసుకోలేక నా భావాలు 
ఆనతి మీరి ప్రవర్తన దోష 
ఫలంబు వీరికి సంప్రాప్తములు    7938 

వీళ్లు భూమిపైన పుట్టియు 
కొంతకాలము నివసించియు  
అచిర కాలంలోనే నా వద్దకు 
వచ్చునట్లు అనుమతించియు 7939 

ముకుందుడు పలికిన మాటలను 
వినిన సనకాది ముని వరులును 
కోపావేశము గలిగియు 
చిత్తమందు తృప్తి చెందకను        7940 

.......

కామెంట్‌లు