పని పాటల స్నేహితులు;-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

కష్టాలను తుడిచేది
 ఆనందాలను పోసేది
 పని పాటలు స్నేహితులే
 పాట విన్న మేలులే

పాట వింటు  పనులు చేస్తే
 పనులు చేస్తూ ఆ పాట వింటే
 ఉత్సాహాలు పొంగేను
 పనులు చకచక నడిచేను

 శ్రమలనే  మరిపిస్తుంది
 పట్టుదలనే పెంచేస్తుంది
 నేర్పూ నైపుణ్యాలనిస్తుంది
 విజయాలు లను తెస్తుంది

కామెంట్‌లు