రెక్కల గుర్రం మా నాన్న!?;-ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)
ఉప్పు తప్ప ఏ గొప్పతనాన్ని లేనీ
సముద్రం లాంటి 
ఒక అమాయకుడు మా నాన్న!!!


కొంచెం కొంచెం ఏటి ఒడ్డున మట్టిని తిని
మట్టి పై మంచి నీటిని ఇచ్చి
మనుషుల్ని చిరంజీవుల్నీ చేసిన
ఒక మంచి పసిపాప చిరునవ్వు మా నాన్న!!


కల్లాకపటం ఎరుగని ఎండిన నల్ల రేగళ్ల పొలం లాంటి మా నాన్న
విషాద చేదు చేనునూ మింగి
చెరుకు పంటై మా కళ్ళల్లో మనోళ్ళల్లో
తీయని చక్కెర కళల్ని పండించిన
ఒక చక్కని శ్రీరామచంద్రుడు మా నాన్న!!!


సూర్యుడు అస్తమించని ఆకాశంలో
కోపిష్టి సూర్యుని నోరు మూయించి 
మా కోసం కాస్త చల్లని కారు మేఘాల్ని
సృష్టించిన నోరులేని ఆకుపచ్చని వృక్షం 
మా నాన్న!!!


కనిపించే నీలాకా

శం మా నాన్న
కనిపించని గాలి మా నాన్న!!

రెక్కలు లేని పర్వతాలకు
రెక్కలు లేని పక్షులకు
రెక్కల గుర్రం మా నాన్న!?

మానాన్న డాక్టర్ రాఘవరెడ్డి కీ నివాళి

Pratapkoutilya lecturer in Bio-Chem palem 8309529273
కామెంట్‌లు