గుర్రం జాషువా గారి వారోత్సవాల సందర్భంగా.:-సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.

 గుంటూరు జిల్లా వినుకొండలో 18 95 లో జన్మించారు గుర్రం జాషువా. వీరి తండ్రి క్రైస్తవ మతం స్వీకరించారు. 19 10 నుంచి 19 15 ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. కాలానికి ఎదురీది ఉభయ భాష ప్రవీణ పట్టా సంపాదించారు. కొంతకాలం నాటక సమాజంలో పనిచేసి e19 19 టు 29 మధ్య లూధర్ చర్చి పాఠశాలలో ఆ తర్వాత జిల్లా బోర్డు పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేశారు. తొలిరోజులలో దీపాల పిచ్చయ్య శాస్త్రి గారితో కలిసి జంట కవిగా ఎన్నో కవితలు వ్రాశారు. ఆ తర్వాత హేతువాద దృష్టి తో మానవతా దృష్టితో ఎన్నో ఖండకావ్యాలు రచించారు. భాష వ్యవహారికం కానీ ఆయన ఛందోబద్ధ ప్రియుడు. వీరిని ఆంధ్ర అ విశ్వకళా పరిషత్తు కళాప్రపూర్ణ బిరుదాన్ని, భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదునిచ్చి గౌరవించింది. గబ్బిలం కాందిశీకుడు వీరి గొప్ప రచనలు. ఇవి కాక తన రచనల్ని ఖండకావ్యాలు గా ప్రచురించారు.
ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర అ వీరికి పేరు తెచ్చిన నా రచనలు. వీరి క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ మీ బహుమతి వచ్చింది. సాత్వికుడు గా నిరాడంబరంగా మానవతా వారిగా పేరుపొందిన వీరు 1971లో పరమపదించారు. వీరికి గండపెండేరం తొడిగి ఏనుగు మీద ఊరేగించారు. ఈయనను గుర్రం జాషువా ను కలం పీష్వా అని కూడా అంటారు రు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 28వ తేదీన జాషువా గారి ఉత్సవాలు ప్రతి చోటా ఘనంగా జరుపుకుంటారు.
కామెంట్‌లు