గద్వాల సోమన్నకు "ఉత్తమ ఉపాధ్యాయుడు"గా ఘన సన్మానం

 తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో  విశేష కృషి చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్నకు "ఉత్తమ ఉపాధ్యాయుడు"గా గుంటూరు లో ఘన సన్మానం జరిగింది. వివిధ రంగాల్లో కృషి చేస్తున్న ప్రముఖులకు,అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంలో భాగంగా "స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ " ఛైర్మన్ డా.ఈదా శామ్యూల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ తొలి మహిళా  హోమ్ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు,గుంటూరు యం.యల్.ఏ  శ్రీ మహమ్మద్ ముస్తాఫా గారు,ఇండియన్ టు బాకో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ,ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్ బాబు మరియు అతిరథమహారధుల చేతుల మీద అరుదైన సత్కారం లభించింది.పెద్దకడబూరు మండల పరిధిలోని, హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా  విధులు నిర్వహిస్తున్న సోమన్న  పలు పుస్తకాలు వ్రాసి ముద్రించడమే కాకుండా  రచనల రూపంలో విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీస్తూ..వారి "చిట్టిచేతులు-గట్టిరాతలు"తో పుస్తక సంకలనాలు వేస్తూ.. మాతృభాష వైపు అడుగులు వేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న సన్మాన గ్రహీత గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.
కామెంట్‌లు