దసరా పాటలు.: సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఇవ్వలేని లోభుల ఇళ్లకు బోము.
మూటగట్టి ఏమి మోక్షము కాదయ్యా.
కోటి నార్జించిన, కూటికే గదయ్యా.
మటుమాయ వాదులను మరి అడగబోము.
సాటి ఎవరు మీతో ను సరసము గదయ్యా.
అయ్యవారికి చాలు, ఐదు వరహాలు.
తెప్పించి కట్నం బు లు ఇచ్చి పంపర య్య.
కటకట మీకెంత కరుణ లేదయ్య
ఇటు వచ్చి యడుగ మాకిది ఇది పద్ధతి అయ్యా.
ఏదయా మీ దయ మా మీద లేదు
ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా
ఉత్తమ జనులారా చిత్తగించండి
ఆలస్యం ముంచకండాకలవుతుంది.
ఆ కళ్ళ చేత మీ వాకిళ్ళలో నూ
ఉంచుట మీకిది మంచి పని కాదు.
పావలా బేడైతే పట్టేది లేదు.
ముప్పావలా ఇస్తే, ముట్టేది లేదు.
రూపాయి ఇస్తే ను ప్రాపకం కాదు.
హెచ్చు వరహా ఇస్తే పుచ్చు కుంటాము.
పై పావులా మాకు పప్పు బెల్లాలు.
తెప్పించి కట్నం బులు ఇప్పించ రయ్య.
శీఘ్రమే పంపు డి శ్రీమంతుడు శ్రీమంతులారా.
శాశ్వతంగా ఆశీర్వాద సత్య వాక్యములు
బాలుర దీవెనలు, బ్రహ్మ దీవెనలు.
బాగుగా మీకిప్పుడు, బ్రహ్మ యు రస్తు.
పసి బాలురము మా పదములు వినియు
కసిరి కొట్టక, మమ్ము కరుణ గైకొనుము.
నలదమయంతుల వంటి, అందములు కలిగి
తెలివి, చక్కని బాల కూతుళ్ళు కలిగి
నల్ల మన్మధుల వంటి అల్లుడు గలిగి
బలవంతులై నటి బలవంతులు గలిగి
పుడమిలో నేను లేని భోగములు గలిగి
వడుగులు పెండ్లిళ్లు వరుసగా గలిగి
పొందుగా నవరత్న భూషణములు గలిగి
ధన ధాన్యములు గలిగే, ధర్మములు గలిగి ధరణిలో
నా చంద్ర తారార్కం గాను చాలా సంతోషము నా.
చెలగుచూ మీరు
పుడమి వర్ధిల్లు డీ పూజ్యులై ఎప్పుడు.
కామెంట్‌లు