బతుకమ్మ(కైతికాలు):-గాదాసు రజిత-మంచిర్యాల.

తెలంగాణ సంస్కృతి
సమైక్యతకు వారధి
బతుకమ్మ పండుగ 
బతుకునిచ్చు పెన్నిధి
నవరాత్రుల సంబరము..
తాకునంట అంబరము..

బతుకమ్మలో పువ్వులు
ధరణిపైనే  తారకలు
జానపదుల పాటలు
జన జీవన ప్రతీకలు
వహ్వా బతుకమ్మ పండుగ 
ఆనందాలే నిండుగ

రోజుకో నైవేద్యము
తీరైన అలంకారము 
ముచ్చటగొలిపే రూపము
బతుకమ్మకు సొంతము
ఆశ్వయుజ మాసమున
అవనిపై సుశోభితము..

ఆడబిడ్డల రాకతో
పుట్టినింట కళకళలు
కొత్తబట్టల ముస్తాబు
పిండివంటల ఘుమఘుమలు
ఉత్సాహం నిండగా
మిన్నంటె బతుకమ్మ వేడుకలు..


కామెంట్‌లు