*ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*


 *సాలూరు సాహితీ మిత్ర బృందం  *
*ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సాలూరు క్వీన్స్* *సంయుక్త నిర్వహణలో* *ఘనంగా జరిగిన గాంధీ జయంతి వేడుకలు*
సాలూరు వేద సమాజం సంస్కృత పాఠశాలలో  గాంధీ జయంతి ని
ఇన్నర్ వీల్ క్లబ్ సాలూరు క్వీన్స్ మరియు సాలూరు సాహితీ మిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
ముందుగా పాఠశాల ఆవరణలో గల గాంధీజీ విగ్రహానికి  పూలమాలవేసి  సభాస్థలికి విచ్చేశారు. ఈనాటి ఈ సభకు సాలూరు సాహితీ మిత్ర బృందం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జే.బి. తిరుమలాచార్యులు గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో  ఇన్నర్ వీల్ క్లబ్ఆఫ్ సాలురు క్వీన్స్ అధ్యక్షురాలు శ్రీమతి కోలగట్ల రమాదేవి గారు సాలూరు సాహితీ మిత్ర బృందం ప్రస్తుత అధ్యక్షురాలు శ్రీమతిరావాడ కృష్ణ కుమారి గారు ఇన్నర్ వీల్ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీయిండుపూరి వెంకటేశ్వర రావు గారు  శ్రీ శేషాద్రి సోమయాజులు గారు ఆసీనులయ్యారు. సాలూరు సాహితీ మిత్ర బృందం పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ దాలినాయుడు గారు సభాహ్వానం పలుకుతూ గాంధీజీపై తొలి ప్రసంగం చేశారు. అనంతరం సభలో మిగిలిన వారందరూ గాంధీజీ యొక్క జీవిత విశేషాలు సభకు వివరించారు . శ్రీమతి కోలగట్ల రమాదేవి గారు, గాంధీగారు ప్రాతఃస్మరణీయులు అని తెలిపారు. శ్రీమతి కృష్ణ కుమారి గారు గాంధీజీ ఆచరించి చూపించిన గొప్ప వ్యక్తిత్వానికి మరో రూపం అని తెలిపారు. శ్రీ శేషాద్రి సోమయాజులు గారు మహాత్మాగాంధీ జీవితంలో ముఖ్య చారిత్రక ఘట్టాలను వివరించారు. శ్రీ వెంకటేశ్వర రావు గారు  విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు. తదనంతరం బాపూజీ పురస్కారంతో  శ్రీమతి "భోగరాజు సూర్యలక్ష్మీ" గారిని ఇన్నర్ వీల్ క్లబ్ మరియు సాలూరు సాహితీ మిత్రుల బృందం సంయుక్తంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాసరచన పోటీలలో పి. త్రివేణి (పురపాలక పాలక పాఠశాల,డబ్బివీధి) ప్రథమ బహుమతిని,డి. మోహన్ సాయి (లైన్స్ క్లబ్ ఉన్నత పాఠశాల) ద్వితీయ బహుమతిని కె. శివ ప్రసాద్ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల) తృతీయ బహుమతిని చోడవరపు యోగిత (వేద సమాజం పాఠశాల) ప్రత్యేక బహుమతిని, ఆర్ వర్షిని( రవీంద్ర భారతి )మరోప్రత్యేక బహుమతి అందుకున్నారు. బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని సాలూరు సాహితీ మిత్ర బృందం ప్రస్తుత కార్యదర్శి శ్రీగొట్టాపు శ్రీనివాస రావు నిర్వహించారు. సభలో శ్రీ చందు మాస్టర్ గానం అలరించింది ఈ కార్యక్రమానికి హాజరైన సాలూరు సాహితీమిత్రులు సభ్యులు శ్రీ గౌరీ శంకర్ శ్రీ గణపతి మాస్టారు శ్రీ చందు మాస్టారు శ్రీ రెడ్డి సత్యన్నారాయణ మాస్టారు శ్రీ కృష్ణ కుమారి గారు శ్రీ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు