*మిట్టపల్లి నానీలు* **:-*మిట్టపల్లి పరశురాములు

నీతి ధర్మం వెనక్కి
తగ్గాయి!
దుర్మార్గాలు
హెచ్చైనాయి!!

అప్పు చేసి బోర్లెన్ని
వేసినా!
నీళ్లు పడింది మాత్రం
రైతు కళ్లల్లో!!

తెగినగాలిపటమే
జీవితం !
ఒంటరి చెట్టుపై
రెపరెపలా గీతం!!

తలాపున గోదావరి
అయితే నేమి!
మన పొలము
ఎడారి !!
       ****
కామెంట్‌లు