సాధువుల మనసు! అచ్యుతుని రాజ్యశ్రీ

 నేటి రోజులు ఎలా ఉన్నాయి అంటే నీతినిజాయితీ గా  బతికే వాడిని "ఆ!వాడు ఓ సన్నాసి చవట!చేతగాని దద్దమ్మ "అని తేలిగ్గా తీసిపడేస్తారు.కానీ అంత నిగ్రహం నిర్మలమనసు ఆచరణలో తామరాకుపై నీటిబొట్టులా ఉండాలి అంటే ఎంతో పూర్వజన్మ పుణ్యం సుకృతం ఉండాలి. మానావమానాలు వారికి పట్టవు.ఎవరైనా ఏదైనా అంటే పట్టించుకోరుకూడా!
సంత్ దాదూ దయాల్ అప్పటికి సన్యాసిగా మారలేదు. షాపు లో కూచుని ఏవో లెక్కలు డొక్కలు చూడటంలో మునిగిపోయాడు. ఆయన గురువు  వాకిలి దగ్గర నిలబడ్డాడు. కానీ గమనించలేదు.హఠాత్తుగా తలెత్తిన అతనికి  గురువు కన్పడటంతో పరుగునవెళ్లి ఆయన పాదాలపై పడ్డాడు. "స్వామీ!లెక్కల డొక్కల వ్యవహారంలో మునిగి మిమ్మల్ని చూడలేదు  క్షమించండి. "గురువు  నవ్వుతూ ఇలా అన్నాడు "నాయనా!నేను వచ్చి చాలా సేపైంది.కానీ భగవంతుడు నీతోటే నీ దగ్గరే ఉంటూ నీవు తనని ఎప్పుడు చూస్తావా అని ఎదురు చూస్తున్నాడు."ఆమాటలతో  దాదూ దయాల్ ఐహికసుఖసంపదల్ని వదిలి సాధుసన్యాసిగా మారాడు.యోగి వేమనకూడా ఒక స్త్రీ మందలింపుతో మారాడు."తుచ్ఛభావాలు  నాశరీరంపై వ్యామోహం వదిలి దైవం పై దృష్టి నిలుపు."అంతేవేమన శతకం చదివితే మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకోగలం.మనం ఎలా ఉండాలో చెప్పాడువేమన.తులసీదాస్ కూడా పుట్టినింటికి వెళ్లిన భార్య కోసం జోరు వర్షంలో నది  ఈదాడు.పాముని తాడుగా భావించి దాన్ని పట్టుకుని అత్తగారి ఇంటి గోడదూకి తలుపులు తట్టాడు.అర్ధరాత్రి తలుపు తెరిచిన భార్య రత్నా వళి మందలించింది"నాధా!నాపై ప్రేమను శ్రీరామ చంద్రునిపై చూపితే మీజన్మ ధన్యం అవుతుంది కదా?"అంతే సాధువై రామచరిత మానస్ రాశాడు.అందులోదే నేడు మనం చదివే హనుమాన్ చాలీసా.
ఒక సాధువు తన శిష్యులతో వెళుతూ కొంత మంది బాబాలు  తులసిపూసలు చేతిలో తిప్పుతూ వచ్చేపోయేవారిని చూసి నవ్వాడు.కొంత దూరం లో శీర్షాసనం వేసిన వారిని కొంచెం పెద్దగా నవ్వాడు.ఇలా వివిధ ప్రార్ధనా స్థలాలలో జనం  పెద్దగా  ఎలుగెత్తి అరవటం చూసి వికటాట్టహాసం చేశాడు. ఇంకొంచెం దూరం లో  రోడ్డు పై  పడున్న ఒక వ్యక్తికి  శైత్యోపచారాలు చేస్తున్న ఒక సామాన్య బీద వ్యక్తి ని చూసి  సాధువు కళ్ళంబడి బొటబొటా కన్నీరు కార్చసాగాడు.శిష్యులు ఆశ్చర్యంగా ప్రశ్నించారు. ఆయన ఇలా చెప్పాడు "మొదట మనం చూసినవారు నిజమైన భక్తులు కారు.అందుకే నవ్వాను.నిజమైన భక్తుడు బాటపై పడున్న వాడికి ఉపచారాలు చేస్తున్న ఆబీద మానవోత్తముడు.అందుకే  ఆనందంతో ఏడ్చాను. "మన ధర్మం  పనులు మానేసి గంపెడు పూలు బుట్టనిండా అర్పించే పళ్లు  కొబ్బరికాయలతో సంతోషించడు.అవసరమైన వారికి సాయంచేస్తూ సేవచేసే వారే నిజమైన  భక్తులు.
కామెంట్‌లు