వెదురు కళ - బాలగేయం ;--ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
బుట్టలు తట్టలు 
పూవుల సెజ్జలు 
వెదురు బద్ధలు 
వేణువు కర్రలు!

ఊయల తట్టలు 
పాపల గిలకలు 
పూజల బుట్టలు 
కూరల సిబ్బిలు 

నడుముకు బె

ల్టులు 
తలపై టోపీలు 
చెత్తకు బుట్టలు 
చిత్రపు మూతలు 

చిల్లుల బుట్టలు 
పూలకు వాజులు 
శ్రామిక శక్తులు 
దేవుని రూపులు!!

కామెంట్‌లు