అల్లకొండ సాహిత్య కళా పీఠం సౌజన్యంతో బులెటన్ విడుదల

 అల్లకొండ సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో ప్రముఖ కవి రచయిత,ఫ్రెండ్లీ పోలీస్ ఏఎస్ఐ తొగర్ల సురేష్ రచించిన అప్సరస పులి జింక కథ బులెటన్ ఆవిష్కరించారు. ముఖ్య అతిధిగా ఆచార్య  శ్రీధర స్వామి మాట్లాడుతూ బాలలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది సాహిత్యమే అని కొనియాడారు.తొగర్ల సురేష్ మాట్లాడుతూ మనం ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి చెట్లే వస్తాయి. బాల్యం నుండే మంచి సాహిత్యం అందిస్తే అలాంటి మంచి వ్యక్తిత్వం గల బాలలు తయారవుతారు. చందమామ అలాంటి సాహితీ సేద్యం చేసింది. దానివల్ల మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు బతికాయి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కంకణాల రాజేశ్వర్ దారం గంగాధర్ కవులు రచయితలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు