సీసపద్యంలో (త్రికసంధి)మచ్చ అనురాధ: జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి , కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా .

 అచ్చోట  ఇచ్చోట అవ్విధ
మైనను
ఎచ్చోట యైనను యెరుగ వలెను,
దీర్ఘ ఆ  ఈ ఏ లు  దేదీప్య మైముందు
వచ్చినన్   గుర్తించ వలెను త్రికము,
అక్కన్య  ఇక్కన్య  అయ్యవ
సరమును
తెలియుడీ పదములు దీటుగాను,
అద్దానవేంద్రుడు  అమ్మేములను చూసి
త్రిక సంధి  గుర్తించు తిరము తోడ .
తేటగీతి
ముందు త్రికము వచ్చినను జూచి మురియ కుండ ,
ఆ తదుపరి ద్విత్వము లను నాచితూచి,
గమన ముంచియు చూడాలి ఖచ్చితముగ,
పైన సూచనలన్నియును పదిలముండు.

కామెంట్‌లు