అగస్త్య మహాముని -( వచన కవిత);- ,ఎం. వి. ఉమాదేవి
అమిత జ్ఞానము తోడ అగస్త్యు డు పుట్టెను 
సప్త ఋషులలో నొకడై సాధువై నిల్చెను 
అగ్ని వాయువుల అంశ
ఆదిత్య హృదయం సృష్టితో 
రామునికిచ్చే విష్ణు చాపము
రామాయణ విలక్షణము!
వాతాపి ఇల్వలుడు  సోదర కుట్ర 
దివ్య దృష్టిలో చూసి 
వాతాపి జీర్ణం గా చేసే 
రక్కసుల మాయనశించి 
మునివాటికలు మురిసే !
 
లోపాముద్ర విదర్భ రాజపుత్రి 
తనకు ధర్మపత్ని గా 
సంసారజీవితం గడుపుతు 
అనేక గ్రంథ రచన, తమిళ వ్యాకరణము 
వెలయించి పరిచయం చేశాడు 
వింధ్య పర్వతము గర్వమణచి వెలిగే వినువీధి తారకై 
సప్తర్షి మండలం కనిన వారికి 
సర్వ శుభములు కలుగు!!

పితృ దేవతల విముక్తి పుణ్య లోకాలకంపి 
వృతాసుర ఆచూకీ కొరకు 
జలధినే పుక్కిటబట్టిన ఘనుడు 
గోదావరి తీరాన గొప్ప తీర్ధయాత్ర 
అగస్త్య గీతా, అగస్త్య సంహితరచన 
మహా మునికి వందనాలు!!
కాశీ పట్టణ వాసి మహాముని 
కలవు మహిమలు ఎన్నో 
తపశ్శక్తి తోడ చిరంజీవయాడు

కామెంట్‌లు