ఆరెంజ్:-లతాశ్రీ

బలే బలే ఆరెంజ్
పసందైన ఆరెంజ్ !బలే!

1.పసుపు రంగు మేనిచాయ
తీపి ,పులుపుల కలయిక
ఎండాకాలం పండుతావు
మేనికి సి విటమిన్ ఇస్తావు

2.నారింజ మిఠాయి నీ రూపం
మా నోట ఊరించు లాలజలం
కమలా ,బత్తాయి నీ ముద్దుపేర్లు
మా బొజ్జలో చల్లగా ఉండు

3.ఆరెంజ్  అంటే నీకానందం
అది రంగో పండో తెలియక
తికమక పడితే నీకానందం
నీ రసం గటగటా తాగటం
పిల్లలకంతా ఆనందం 
కామెంట్‌లు