చెత్త అబ్బాయి కవిత.:-తాటికోల పద్మావతి గుంటూరు.

 చినుకుల చొక్కా తైల సంస్కారం లేని జుట్టు
మురికి బట్టలతో తెల్లవారితే చాలు
ప్రజా సేవకుడు ఇలా బయలుదేరి
రాత్రి చీకటిలో గుమ్మరించిన అసత్యాలని 
మూటగట్టి వీధిలోకి విసిరేసిన క్యారీ బ్యాగులు
ఏరి చెత్త వెధవ లా చెత్తనంతా పోగుచేసి 
ఇ వీధుల్ని శుభ్రం చేసే మరో గాంధీ అతడు.
వాడు మనిషే సుచి శుభ్రం అన్నీ ఉంటాయి
ప్రతి ఇంట్లో పేరుకుపోయిన మురికిని 
వదిలించుకోవాలని బయట పడేస్తే
తోపుడు బండి ఇ తోసుకుంటూ వచ్చి
ముక్కుపుటాలను ఎదగడమే దుర్గంధాన్ని భరిస్తూ
చీపురుతో శుభ్రం చేసి ఇ చెత్తాచెదారాన్ని ఎత్తి
తిని పారేసిన ఎంగిలి విస్తరాకులు
పసిపిల్లల మలమూత్రాలు తుడిచిన పాత గుడ్డలు
కుళ్ళు కంపు కొడుతున్న కాలుష్య లన్నిటిని
చీదరించుకుని పారేసిన ఛండాలు చెత్త బుట్టలో వేసుకొని
ఎక్కడో దూరంగా పడేసి
పరిసరాల పర్యావరణాన్ని కాపాడే సైనికుడు అతడు.
మురికి కాల్వలను రోడ్లమీద ఉమ్మిని,
 కిల్లి మరకల్ని తుడిచి శుభ్రం చేసి,
 పురవీధుల్లో అందంగా తీర్చిదిద్దే 
అద్భుత కళాకారుడు అతడు.
అహరహం వీధి సేవకే అంకితమై 
అబ్బాయి గా ముద్ర వేయించుకుని 
ఎవరి చేత ఆదరించబడనివాడు.
సన్మానాలు సత్కారాలు చేయకపోయినా
ఖరీదు కట్టలేని అతని సేవలకు 
చిన్నపాటి గుర్తింపు పైన ఉండాలి.
మనసులో కాలుష్యాన్ని నింపుకుని
శరీరానికి సెంట్లు పులుముకునే 
మనుషుల కన్నా స్వచ్ఛమైన 
నా మనసు గల చెత్త అబ్బాయికి మనస్ఫూర్తిగా
అభినందనలు చెప్పాలి.
కామెంట్‌లు