నవరాత్రి. ఆచరణ ప్రయోజనం.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 నవరాత్రులలో దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా పూజిస్తే అనేక సమస్యలతో ఆందోళనలతో, ఆలోచనలతో మనసులో చేరిన అహంకారం స్వార్థం, ఈర్ష అసూయ మున్నగు దుర్గుణాలు తొలగి నిర్మల మనసు ఉ ఏర్పడుతుంది. దేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. స్త్రీలపై మాతృభావన, పవిత్ర భావాలు ఏర్పడతాయి.
అజ్ఞాతవాసానికి ముందుగా ధర్మరాజు దుర్గాదేవిని స్తోత్రం చేసి ఆయుధాలు శమీ వృక్షం పై ఉంచి వెళ్లారు. అర్జునుడు భారత యుద్ధానికి బయలుదేరుతూ శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు రథం దిగి, పరిశుద్ధుడవై తమకు విజయం కలిగేందుకు దుర్గాదేవిని స్తుతించాడు. విజయం సాధించాడు.
సర్వదేవతలకు ఈ శరన్నవరాత్రులు ఆనంద పండుగలు కనుక అన్ని ఆలయాల్లోనూ ఈ నవరాత్రి పూజ కైంకర్యాలను చేస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఈ నవరాత్రులలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కనుక ఈ నవరాత్రులు సర్వ దేవత పూజ సమాహార రూపాలు. బాహ్య శత్రువు విజయ సూచకాలు. జ్ఞాన బోధ కాలు, బ్రహ్మానంద సాధా కాలు. మనిషి లో నిక్షిప్తమై ఉన్న దివ్యశక్తిని వేలారే గొప్ప శక్తి ఈ నవరాత్రి పూజా విధానాల్లో ఉన్నది.

కామెంట్‌లు