*కవులతోట సిద్దిపేట*(మణిపూసలు):-*మిట్టపల్లి పరశురాములు
చక్కనైన సిద్దిపేట
కవులకవన పూలతోట
సిద్దిబుద్దులందుమేటి
కవనసీమప్రగతిబాట

రాజకీయనాయకులకు
వర్ణ చిత్రకారకులకు
ఆలవాలమైనిలచెను
బహుభాషలకోవిదులకు

వేముగంటి వెలసెనిచట
మంజీరనాదములబాట
కాపువంశతిలకమూర్తి
వాసిగాంచెచిత్రమిచట

కోటిలింగమూర్తివెలసె
సాయిబాబాలీలమెరిసె
పాలపిట్టపరుగులెన్నొ
సెలయేరులఝరులుకురిసె
             


కామెంట్‌లు