"నరకాసురులు ">డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 అప్పుడెప్పుడో 
నరకాసురుఁడు 
ఏవేవో ..
దుష్టకార్యాలు 
చేసాడని ...
నరకాసురవధను 
నటిస్తున్నాం ...!
అది 
మనం చూసింది 
లేదు !
చూసింది 
కాదు !
మరి ..
మన నిత్య జీవితంలొ 
మన కళ్లెదుట 
కనిపించే ,
అభినవ నరకాసురుల 
గురించి ...
స్పందించం ఎందుకు ?
ఆదునిక నరకాసుర 
ఆగడాలు ...
అరికట్టే నేపథ్యంలో ,
మనకిప్పుడు ..
సత్యభామలు కావాలి !
వెన్నెముకగల ...
సత్యభామలు కావాలి !!
*********************
కామెంట్‌లు