ముగ్గులు,గోరింటాకు ;---ఎం. వి. ఉమాదేవీ నెల్లూరు
పద్యము (మత్తకోకిల)

తెల్లవారగ చల్లినారము తేటనీటిని వాకిటన్ 
ఉల్లమందున సంతసమ్మది యున్నతమ్ముగు ముగ్గులన్ 
పల్లె వీధుల సుందరమ్మగు పల్విధమ్ముల రంగులే 
ఎల్లవారికి రంగవల్లులనెట్లు వేయుట నేర్పగన్!

చేతివేళ్ళకు చాలగొప్పగ చెల్లిపెట్టిన చాందినీ 
రాతిరంతయు నొక్కతీరున రమ్య భావన యెర్రనై 
నూతి యొద్దకు వెళ్లిచప్పున నొక్కిచెక్కులు  తుడ్వగన్ 
నాతికందెను చందమామయె నవ్వుచుండెను చుక్కలున్!!

కామెంట్‌లు