విద్యార్థి ; -పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

 బ్యాగు వేసుకొని ఉయ్యాలో
బడికి పోయేటి  ఉయ్యాలో 
బాల బాలికలు ఉయ్యాలో
మంచిగ చదువాలి ఉయ్యాలో
 గురువుల బోధలు ఉయ్యాలో
 చక్కగా వినాలి ఉయ్యాలో 
చదువాలి రాయాలి ఉయ్యాలో 
చక్కగా నేర్వాలి ఉయ్యాలో 
పరీక్షలు రాయాలి ఉయ్యాలో
ప్రథములుగా నిలువాలి ఉయ్యాలో
 పోటీలు పడాలి ఉయ్యాలో
రోజింత చదువాలి ఉయ్యాలో
రోజింత రాయాలి ఉయ్యాలో 
అట్లు చేయకున్న  ఉయ్యాలో 
  చదవని వారింత ఉయ్యాలో
వింత పశువులంటారు ఉయ్యాలో
 ఏండ్లు పెరుగుతాయి ఉయ్యాలో 
తరగతులు మారుతారుఉయ్యాలో
పదవ తరగతిలో ఉయ్యాలో
పాసైన గాని  ఉయ్యాలో
 ఏది చదవలేరు ఉయ్యాలో 
ఏమి రాయలేరు ఉయ్యాలో
ఉద్యోగాలె రావు ఉయ్యాలో
 రామ రామ ఉయ్యాలో 
రామనే శ్రీ రామ ఉయ్యాలో
 ఉయ్యాల ఉయ్యా ఉయ్యాలో 
గురువుల తీరుగా ఉయ్యాలో 
విద్యార్థులంత  ఉయ్యాలో
గొప్ప వారు కావాలి ఉయ్యాలో
 ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
కామెంట్‌లు