*పూల ముత్యాలహారాలు*:-*చైతన్య భారతి పోతుల*

 377.
భూమాత ఒడిన అమ్మలు,
మీరు విరిసిన కొమ్మలు.
పూసెను రంగుల పూలు,
పులకించే బతుకమ్మలు.
378.
వీచె మలయసమీరాలు,
కదిలే వయ్యారాలు.
లతల యొక్క అందాలు,
వర్ణించలేవు మనసులు.
379.
పూలతోని మనబంధము,
ఋణపడెను సంబంధము.
తలుచుకున్న నా హృదయము,
ఉప్పొంగెను అనుక్షణము.
380.
పవనాలు తెచ్చు కబురులు,
వింటూ ఆడించు తలలు.
ప్రియసఖునికి బహుమతులు,
తిరిగి పంపు పరిమళాలు.
381.
వయ్యారమొలకకే సుమ,
మా హృదయ మనోరమ.
పెనవేసుకున్న బంధమ,
ఎదలో నుండిపో మిత్రమ.
382.
అలంకారమై నీవు,
మాలలల్ల ఒదిగేవు.
తలలోన సుమ నీవు,
అగ్రస్థానమే నీవు.
383.
దైవ సన్నిధానము,
గౌరవ సన్మానము,
అలంకార తోరణము,
అంతటా సుమ శోభము.
384.
తీర్చు ముద్దుముచ్చటలు,
రంగురంగుల పూవులు.
గుండెలో వసంతాలు,
విరిసెనే అందాలు.
385.
సుకుమార సుమలతలు,
సుతిమెత్తని నడకలు.
మోగు లాళ్యాణ ఘడియలు,
నరునికి నవ్య బాటలు.
386.
ఇంద్రధనుస్సు రంగులు,
పరిమళించు సుమాలు.
పరుచుకున్న అందాలు,
మనసు దోచే విరులు.
 

కామెంట్‌లు