శ్రీ మహా భాగవత పోతన మణిపూసలు :-వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సిద్దిపేట.

పగలు రాత్రి భేదము లేకను 
కర్మలన్నియు క్షీణమయ్యెను 
లోకాలకు క్షేమము కూర్చుము 
రక్షణ కోరి వచ్చితి మనెను           7871

కోరికలును లేని వారై 
భువనాలు తిరిగిన వారై 
శ్రీహరిని కొలవాలనే 
ఉద్దేశ్యమును గలవారై      7872 

బయలు దేరారు బుధ  సత్తములు  
చూపారు వైకుంఠ అందాలు 
దివ్య శోభ వైభవంతో 
వెలిగిపోతున్నట్టి  భవనాలు        7873 

ప్రసన్న జన రమణీయ నామము 
జనన విరామ సన్నుత భూమము 
సుజన భక్త లోక పాలన 
గుణదామము వైకుంఠధామము    7874 

ఆ మహానీయ పట్టంబున 
నిష్కామంబునను వసించిన 
సత్ఫలముగా దలపోసి 
ముముక్షు దారులై సుఖించిన     7875

శ్రీ విష్ణువనిన గిట్టనివారు 
అన్య విషయాసక్తి గలవారు 
చెడ్డ పనులతో దుర్గతి పొందు 
వారంత ప్రవేశించను లేరు         7876 

హరి పరమేశు కేశవ అనంతుడు 
బుద్ధి చాతుర్యంగల మానవుడు 
నిశ్చల భక్తితో మోహితులైన 
వైకుంఠధామము చేర్చునతడు       7877 

మంగళకర దివ్య కథలను వినిన 
కంటనీరును గద్గద స్వరంబున 
శరీరం పులగించిన వారు 
వైరాగ్య బుద్ధులకు మోక్ష స్థాన             7878 

వర వైకుంఠము సార సాకరము 
దివ్య స్వర్ణ శాలంక గోపురము 
హార్మ్యా వృత మైన తద్భవన  
మంబోజము దన్మంది రాంతరము       7879 

విభ్రాజిత భోగపు కర్ణికము 
తదుద్యద్భోగపు పర్యంకము 
మందిర వొందను వసియించు 
హరినేపారు భృంగా కతము         7880 


కామెంట్‌లు