దసరాపాటలు;--సత్యవాణి
 బంగారు జలతారు బంగారు జలతారు రంగైన పాగా
ముత్యాల పోగులు ముద్దు టుంగరములు
చేతి కంకణ బిరుదు చంద్రహారాలు
నిలువు టంగీలును  నీలాప మణులు
భూమిక రత్న గొలుసు లుంగ్రాలు
మాణిక్య కిరీట మహితా ప్రతాప
అయ్యవారికి చాలు అయిదు వరహాలు
చిన్న వారికి  చాలు
సిరి శనగ పప్పు
బాలుర
--------------------------
శ్రీశుభాకరముగ స్థిరతంబగును
పేరైన మాఊరి పిన్న బాలురము
మేము వచ్చిన మనవి మిగుల వినరయ్య
మా యిండ్లలో మేము పిన్న బాలురము
ఆడుచు నుండగా నరుదెంచినాము
తల్లిమము వేడ్కతో మర్యాదగాను
మా తండ్రిగారితో మనవిగా చెప్పి
మాకు విద్యలు చెప్ప మన్ననలతోను
పాటించి తెచ్చి యీదంపతులను నిలిపి
మము చదువబంపిరి మా తల్లిదండ్రి
అది మొదలుగా మేము
చదువుచుండెదము
నవరాత్రి పండుగను నార్యులందరికి
పండుగలు మాకును మెండు వేడుకలు
మీ కటాక్షంబున మేము వచ్చితిమి
దానములలో విద్యాదానమే హెచ్చు
అయ్యవారికి భూమి ఐదు వీసములు
పన్నెండు వరహాలు బహుమానమిచ్చి
నిలిచి చెప్పించుడి నేర్పుగా చదువు
బాలురకు సెలవిచ్చి బంపుడింటికిని
దీనుల రక్షించు దీనజనమందార

కామెంట్‌లు