అమ్మవారి తొమ్మిది అవతారాలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 1 మహాకాళి. మధు కైటభ సంహారంలో విష్ణు దేవుని ప్రోత్సహించి అందుకు తోడ్పడింది.
2. మహాలక్ష్మి. మహిషాసుర మర్దిని. మహిషాసురుడనే రాక్షసుని మహాలక్ష్మి రూపంతో పరాశక్తి సంహరించింది.
3. మహా సరస్వతి. పరాశక్తి శుంభ ని శుంబాది రాక్షసుల్ని మహా సరస్వతి రూపంతో సంహరించింది.
4. నంద. నందుని ఇంట నందా అనే పేరుతో అవతరించింది. కంసుడు ఆమెనూ సంపుట కై పైకి విసరగా ఆమె తప్పించుకొని నీ ప్రాణ శత్రువు నందుని ఇంట సుఖంగా పెరుగుతున్నాడని చెప్పి అంతర్ధానమై పోయింది.
5. రక్త దంతి. ఒక రాక్షసుని ఆమె సంహరించి, నోటితో చీల్చి వేసి నందువల్ల ఆమె దంతాలు రక్తంతో తడిసి ఎర్రగా అయ్యాయి. అందువల్ల రక్త దంతి అయ్యింది.
6. శాకంబరీ. ఒకప్పుడు కరువు ఏర్పడగా అమ్మవారు ప్రజలకు శాకములు, ఫలాలు ప్రసాదించింది అందువల్ల శాకంబరీ అయింది.
7. దుర్గ. దుర్గడు లేక దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది.
8. మాతంగి. మతంగ మహర్షి పుత్రిక. మతంగా కులంలో పుట్టిన ఒక రుషి, పరాశక్తి తన కూతురు కావాలని తపస్సు చేశాడు. ఆమె మాతంగి అనే పేరుతో ఆ మహర్షికి జన్మించింది.
9. భ్రామరి. అరుణుడు అనే రాక్షసుని తుమ్మెదల సహాయంతో చంపి నందున బ్రా మరి అయింది.
ఈ తొమ్మిది రోజులు ఆయా రూపాలకు తగినట్లుగా అలంకారాలు ఆయుధాలు ధరించి, నవదుర్గలుగా ప్రకాశిస్తూ దివ్యతేజస్సుతో తుని కరుణిస్తుంది జగన్మాత.
కామెంట్‌లు