*డాక్టర్ చిటికెన కు గ్లోబల్ హ్యూమన్ ఎక్సలెన్స్ అవార్డు*

 యునైటెడ్ నేషన్స్ సస్తే నీబుల్ డెవలప్మెంట్ గోల్స్ సమావేశం 
తేదీ 24 అక్టోబర్ ఆదివారం రోజున తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వేదికగా... ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్  అండ్ డిప్లమాటిక్ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశంలో  ప్రముఖ వ్యాసకర్త, ఇంటర్నేషనల్ బెనివేలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు -డా.చిటికెన కిరణ్ కుమార్ కు
గ్లోబల్ హ్యూమన్ ఎక్సలెన్స్ 
పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  -డా.వి.కె. నరేష్, డా.అవినీంద్ర కుమార్,
 మరియు  శ్రీలంక దేశస్తులైన తరమలింగమ్ తరేశనమ్ ( మదర్ కేర్  ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫౌండేషన్  ఆసియా ), అమరి నిజమ్ చైర్మన్, డైరెక్టర్ ( యూత్ స్పెషల్ డెవలప్మెంట్ మూమెంట్ యూత్ ( ఎస్. డి. ఎం ) శ్రీలంక,  మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా -డా.ఎస్. శివ రామకృష్ణ, కె చంద్రశేఖర్, అంజనీకుమారి పీవీపీ (సి. ఎస్. సి కోర్టు టీ.ఎస్ ఇండియా ), వి. మధుమతి ( ప్రెసిడెంట్, సాయిచరణ్ కళాక్షేత్రం.టీ. ఎస్ -ఇండియా )నిర్వాహకులు ఏలూరు శ్రీనివాస్, పైడి అంకయ్య కార్యక్రమంలో పాల్గొనగా డాక్టర్ చిటికెన మాట్లాడుతూ ప్రపంచ మానవాళి ఏకతాటిపై నడిచి సమాజానికి వ్యతిరేక మైనటువంటి అనర్థాలను ఎప్పటికప్పుడు  యువత అవగాహన చేసుకుని మార్పు కోసం యువత కృషి  ముందుండి చేపట్టాల్సిన బాధ్యతలు ప్రధానంగా మాదకద్రవ్యాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ వివిధ అంశాలతో  తన సందేశాన్ని అందించారు. ఇట్టి పురస్కారాన్ని అందుకున్నందుకు  సంస్థ నిర్వహణ కమిటీకి ధన్యవాదములు తెలియజేశారు.
కామెంట్‌లు