పోషకాహారం-గుడ్డు(కైతికాలు)-తాళ్ల సత్యనారాయణ-హుజురాబాద్.

గుడ్డు అంత శ్రేష్ఠమైన
ఆహారం మరొటిలేదు
తల్లిపాల తర్వాత
స్థానం గుడ్డుకే కలదు
పోషకాహారానికి గుడ్డు
సంజీవని ఈఫుడ్డు

విటమిన్లు మినరల్స్ 
నిండిన సూపర్ ఫుడ్డు
పొటాషియం జింక్
ఐరన్లు ఉన్న గుడ్డు
ఆరోగ్యకరమైనది
నిత్యం తీసుకోదగినది

ఆరోగ్యమిచ్చు కొవ్వు
మాంసకృత్తులున్నది
కండరాల బలోపేతం
చేసే గుణమున్నది
నిత్యం ఒకగుడ్డు
ఆరోగ్యమైన ఫుడ్డు

కాల్షియం పుష్కలంగ
కలిగివున్నది గుడ్డు
ఎముకల పటిష్టతకు
సహాయపడు ఫుడ్డు
అందమైన గుడ్డు
ఆరోగ్యమిచ్చు ఫుడ్డు

విటమిన్ ఇ ఇంకా
ఫోల్లెట్లు పుష్కలంగ
ప్రోటిన్లు శరీరానికి
అందుతాయి అధికంగ
ప్రతిరోజు ఒకగుడ్డు
తినడం ఫలితంగా.

కామెంట్‌లు