తాత్త్వికుడు-డాక్టర్ అడిగొప్పుల సదయ్య

సత్యాగ్రహంబనెడు చక్రాయుధముతోడ
తెల్ల మ్రుచ్చుల తరిమి వెళ్ళగొట్టినవాడు

అహింసామార్గమే అన్ని కాలాలలో
ఉత్తమోత్తమమనియు ఉటంకించినవాడు

స్వచ్ఛభారతముకై స్వప్నములు తాకనియు
నరేంద్రమోడీకి నారాధ్యుడైనాడు

నిత్యజీవితముతో సత్య శోధనచేసి
పొత్తమందున సత్తె విత్తు దాచినవాడు

పరమతపు సహనమే పరిమళించగ తాను
హృదయ కుసుమాలనే ఉదయింపజేశాడు

హరిజనోద్ధరణయే పరమ ధర్మంబనియు
వారి మేళ్ళ కొరకు పోరు జేసినవాడు

భావవాదపు విద్య బహుళార్థ సాధకము
బేసిక్ విధానమే భేషన్న తాత్త్వికుడు

రక్త బిందువు నేల రాలకుండా తుదకు
దేశ దాస్య సంకెల తెంపివేసినవాడు!

బోసి నవ్వుల తాత! పోరు సల్పిన నేత!
స్వేచ్ఛనిచ్చిన దాత! స్వీకరించుము జోత!!


కవనశ్రీ చక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125

కామెంట్‌లు