శాస్త్రవేత్తల జీవితాలలో తమాషాలు! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 1.ప్రసిద్ధ  మనోవిజ్ఞానవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్  ఒకసారి  తనభార్య పిల్లలతో కలిసి తోటలో విహరిస్తూ ఉన్నాడు. కాసేపటికి ఇంటికి బయలుదేరిన అతనికి కొడుకు కనపడలేదు.ఆలుమగలు  కబుర్లలో పడి పిల్లల పై దృష్టి పెట్టలేదు. భార్య ఖంగారుగా అంది"ఏమండీ!మన బాబు కనపడటంలేదు. కాస్త వెతకండి."ఆయన జవాబు ఇది"ఆ!ఎక్కడికీ పోడు.ఇక్కడే ఎక్కడో తిరుగుతుంటాడులే!" భార్య కు ఏడ్పు దు:ఖంముంచుకు వచ్చాయి. "వెతుకుదాం పదండి " "నీవు  వాడిని  హెచ్చరించావా?అటువైపు వెళ్ళకు..జాగ్రత్త అని?" కాసేపు ఆలోచించి ఆమె అంది"ఆ..గుర్తు వచ్చింది.ఆనీళ్లఫౌంటెన్ దగ్గరకు వెళ్లవద్దు అని పదేపదే హెచ్చరించానండీ?అలాచేస్తే  విధించే శిక్ష నుగూర్చి గట్టిగా మరీమరీ చెప్పాను."  వెంటనే ఆయన అన్నాడు'ఇంకేం?మన పుత్రరత్నం అక్కడే ఆడుతూ ఉండాలి!?" ఫ్రాయిడ్ భార్య అక్కడ చూసిన దృశ్యం చూసి బిత్తరపోయారు.వాడు హాయిగా ఆఫౌంటెన్ నీటి తుప్పర్లతో ఆడుతున్నాడు.భార్య ఆశ్చర్యంగా అడిగింది "ఏమండీ!బాబు ఇక్కడే ఉంటాడని ఎలా ఊహించారు?"ఫ్రాయిడ్ నవ్వు తూ అన్నాడు"మనం వద్దు  ఆపనిచేయవద్దు  అని పిల్లలని పదేపదే హెచ్చరించితే వారు  పంతంకొద్దీ ఆపనే చేసి తీరుతారు.మనం పెద్దలంకూడా అంతేకదా?"సిగ్మండ్ ఫ్రాయిడ్ అందుకే ముందు చూపుతో ఆలోచించి మనిషి మనసు దాని స్వభావంని గూర్చి పరిశోధనలు చేశాడు.
2.బర్నర్ హైజన్ బర్గ్ ఒక భౌతిక శాస్త్రవేత్త. పశ్చిమ జర్మనీకి చెందినవాడు. నోబెల్ బహుమతి పొందాడు.తన19వ ఏట బడిలో సెంట్రీగా చేరాడు.తన డ్యూటీ చేస్తూ ప్లాటో రాసిన పుస్తకం "థిమైయస్"దొరికితే  దాన్ని చదవటం మొదలు పెట్టాడు. దాంట్లో ప్రాచీన గ్రీక్ ప్రామాణిక సిద్ధాంతాలున్నాయి.దాన్ని తెగచదివి బాగా బుర్రకెక్కించుకున్నాడు.స్వయంకృషితో తన 23వ ఏటప్రొఫెసర్  మాక్స్ ప్లాంక్ దగ్గర సహాయకునిగా చేరాడు.అంతే!చకచకా నిచ్చెనలు ఎక్కి తన 24వ ఏటకోపెన్ హాగెన్ విశ్వవిద్యాలయంలో లెక్చరరు గా 26వ ఏటప్రొఫెసర్ గా 32వ ఏట నోబెల్ బహుమతి పొందాడు. ఒక పుస్తకం ప్రభావం వల్ల సెంట్రీగా ఉన్న కుర్రాడు  13ఏళ్ళలో నోబెల్ బహుమతి విజేతగా నిలిచాడంటే ఆతని కృషి పట్టుదల ఎలాంటిదో తెలుసుకోండి.పిల్లలు ఇలాంటి పుస్తకాలు చదివితీరాలి. పుట్టినరోజు పండుగలు నిరాడంబరంగా చేసుకుని పిల్లలకి స్ఫూర్తి కలిగించే జీవిత చరిత్రలున్న పుస్తకాలు బహుమతి గా ఇవ్వాలి.
కామెంట్‌లు