చిన్న చిన్న చిట్కాలు....; పి . కమలాకర్ రావు

 కడుపుబ్బరం ( Gastritis)....
క్యాబేజి రసం లో క్యారట్ రసం
కలిపి పరగడుపున త్రాగితే కడుపు ఉబ్బరం తగ్గి పోతుంది. కడుపులో పుండు వున్నా తగ్గి పోతుంది.
అల్సర్ తగ్గడానికి....
క్యారట్ రసం లో కొబ్బరిపాలు, ఆవుపాలు తాటి కల కండ కొద్దిగా మంచి నీరు కలిపి త్రాగితే అల్సర్
తగ్గి పోతుంది.
మొటిమలు తగ్గడానికి.....
కరక్కాయ పొడిలో కొద్దిగా పసుపు
నీళ్లచుక్కలు కలిపి మొటిమలపై
రాస్తువుంటే మొటిమలు తగ్గిపోతాయి.
కాళ్ళల్లో చెమట, చెడ్డవాసన - నివారణ.
ఉసిరి కాయ పొడిని నీళ్ళల్లో కలిపి
ప్రతి రోజు త్రాగుతుంటే కాళ్ళల్లో చెమట రావడం తగ్గి పోయి చెడ్డ వాసన రావడం కూడా తగ్గి పోతుంది.
 కళ్ళల్లో ఎరుపు, కళ్ళల్లోంచి నీరు కారడం - నివారణ.
ఎడమ కన్ను ఎర్రబడితే, కుడి కాలి బొటన వేలుకు  సున్నం రాసుకొని పడుకోవాలి. కుడికన్ను ఎర్రబడితే ఎడమ కాలి బొటన వేలుకు సున్నం రాసుకొని పడుకొంటే కళ్ళల్లో ఎరుపు తగ్గి పోతుంది.
కామెంట్‌లు